మ‌హారాష్ట్ర‌లో మ‌రో చిచ్చు.. ఈ సారి గవ‌ర్న‌ర్ వంతు

Update: 2022-07-30 13:30 GMT
ముంబయి ఆర్థికస్థితిని ఉద్దేశించి మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్ కోశ్యారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్రను విడిచి వెళ్లితే.. ఈ రాష్ట్రంలో డబ్బేం మిగలదని, దివాలా తీస్తుంద‌ని అన్నారు.  

ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..  "గుజరాతీలు, రాజస్థానీలు మహరాష్ట్ర నుంచి మరీ ముఖ్యంగా ముంబయి, ఠాణెను విడిచివెళ్లిపోతే.. ఈ రాష్ట్రంలో డబ్బేం మిగలదు. ముంబయి దేశ వాణిజ్య రాజధానిగా ఉండే అర్హత కోల్పోతుంది. రాష్ట్ర దివాలా తీస్తుంది" అని అన్నారు.

వీరు ముంబయిని ఆర్థిక రాజధానిగా మార్చడంలో అందించిన సహకారాన్ని ఆయన కొనియాడినట్లు గవర్నర్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గుజరాతీలు, రాజస్థానీలు.. మహారాష్ట్రను విడిచి వెళ్లిపోతే రాష్ట్రంలో డబ్బేం మిగలదంటూ కోశ్యారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ముంబయి దేశ వాణిజ్య రాజధానిగా ఉండే అర్హత కోల్పోతుందని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను తప్పుపట్టిన శివసేన నేత సంజయ్ రౌత్.. రాష్ట్ర ప్రజలను అవమానించారని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలను మహారాష్ట్ర నేతలు తప్పుపట్టారు. ఈ మాటలతో కష్టపడి పనిచేసే మహారాష్ట్ర ప్రజలను అవమానించారంటూ శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శించారు. ``బీజేపీ మద్దతు పొందిన ముఖ్యమం త్రి అధికారంలోకి రాగానే, మరాఠీ వ్యక్తి అవమానానికి గురవుతున్నాడు.

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ వ్యాఖ్యలను ఖండించాలి" అంటూ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై గవర్నర్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌, శివసేన నేతలు డిమాండ్ చేశారు.

ఇటీవల కాలంలో మహారాష్ట్ర రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. శివసేన పార్టీ ఎమ్మెల్యేలు అసమ్మతి జెండా ఎగరేయడంతో ఉద్ధవ్‌ నేతృత్వంలోని ఎంవీఏ కూటమి కూలిపోయి.. బీజేపీ మద్దతుతో అసమ్మతి నేత ఏక్‌నాథ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక, కోశ్యారీ నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావడం ఇదే మొదటిసారేం కాదు. గతంలో కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుల విషయంలో ఆయనకు అప్పటి ఉద్ధవ్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడిచింది.
Tags:    

Similar News