తెలుగు రాష్ట్రాల‌పై మోడీ న‌జ‌ర్ ఎంతంటే?

Update: 2019-06-04 05:13 GMT
తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఢిల్లీకి వెళ్లారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఢిల్లీ టూర్ కు వెళ్లాల్సిన విష‌యాలేమీ లేవు క‌దా? అని అనుకోవ‌చ్చు. నిజానికి పెద్ద‌గా విశేషాలు లేవ‌న్న‌ట్లుగా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న దేశ రాజ‌ధానికి ఎందుకు వెళ్లిన‌ట్లు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికే ప్ర‌య‌త్నం చేస్తే ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ఇటీవ‌ల త‌న ద‌గ్గ‌ర రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌.. జ‌గ‌న్ లు భేటీ కావ‌టం.. వారి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌టం.. ఇరువురు ముఖ్య‌మంత్రులు రెండు రాష్ట్రాల మ‌ధ్యనున్న పంచాయితీల్ని ప‌రిష్క‌రించుకోవాల‌ని డిసైడ్ అయిన‌ట్లుగా తెలిసిందే.

వార్త‌ల్లోకి వ‌చ్చిన అంశాలే కాకుండా.. బ‌య‌ట‌కు రాని విశేషాలు ఎన్నో ఉన్న నేప‌థ్యంలో.. వాట‌న్నింటిని ఢిల్లీ బాస్ కు అప్డేట్ చేయ‌టం కోస‌మే గ‌వ‌ర్న‌ర్ తాజా ఢిల్లీ ట్రిప్ జ‌రుగుతుందంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కీల‌క ప‌రిణామాలు ఏం జ‌రిగినా.. వెంట‌నే గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధాని మోడీతో భేటీ కావ‌టం తెలిసిందే. దేశంలోని మ‌రే రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కు ప్ర‌ధాని మోడీ ఇవ్వ‌నంత ప్ర‌యారిటీ న‌ర‌సింహ‌న్ కు ఇస్తార‌ని చెబుతారు.

రెండు తెలుగు రాష్ట్రాల మీద మోడీ న‌జ‌ర్ ఎంత‌న్న దానికి నిద‌ర్శ‌నంగా న‌ర‌సింహ‌న్ తాజా ఢిల్లీ ట్రిప్ గా చెప్ప‌క త‌ప్ప‌దు. వ‌రుస‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌కు సంబంధించిన ఫ‌స్ట్ హ్యాండ్ స‌మాచారాన్ని ఫీడ్ బ్యాక్ రూపంలో ప్ర‌ధానికి వివ‌రించేందుకే గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీకి వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. దీనికి త‌గ్గ‌ట్లే మోడీని న‌ర‌సింహ‌న్ భేటీ కావ‌టం.. అనంత‌రం ఢిల్లీలో ప‌లువురు ప్ర‌ముఖుల్ని ఆయ‌న క‌ల‌వ‌టం గ‌మ‌నార్హం. తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ అప్డేట్స్ విష‌యంలో మోడీ ఎంత ఆస‌క్తి చూపుతార‌న్న‌ది తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థం కాక మాన‌దు.
Tags:    

Similar News