ఢిల్లీని పిలుపు రావటం.. గవర్నర్ నరసింహన్ వెళ్లటం ఈ మధ్య తరచూ జరుగుతున్న వ్యవహారమే. అలా ఢిల్లీకి వెళ్లిన సమయంలో కేంద్ర హోంమంత్రిని ఆయన ఏకాంతంగా కలవటం లాంటివి జరుగుతుంటాయి.
తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో శుక్రవారం భేటీకి గురువారం సాయంత్రం నాలుగు గంటలకే బయలుదేరిన నరసింహన్.. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం రాజ్‌నాధ్‌ను కలిశారు. అయితే.. ఈ భేటీకి గవర్నర్‌తో పాటు.. హోంశాఖ అధికారులు ఇద్దరు హాజరు కావటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎప్పుడూ వన్‌టు వన్ అన్నట్లుగా కేంద్రహోంమంత్రితో మాట్లాడే గవర్నర్.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా అధికారుల సమక్షంలో హోంమంత్రి మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓటుకు నోటు వ్యవహారం.. సెక్షన్ 8 అమలుకు సంబంధించి హాట్.. హాట్‌గా చర్చ జరుగుతున్న సందర్భంగా హోంశాఖ అదికారుల్ని పిలిపించుకొని.. గవర్నర్‌తో పాటుగా రాజ్‌నాథ్ సమావేశం నిర్వహించటం చూస్తుంటే.. సెక్షన్ 8పై కేంద్రం స్పష్టమైన వైఖరిని వెల్లడించి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.