గవర్నర్ స్థానానికి సరికొత్త ఇమేజ్ తీసుకురావటంలో తెలంగాణ గవర్నర్ నరసింహన్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి వారం.. పది రోజులకోమారు రాజ్ భవన్ కు వెళ్లి.. గవర్నర్ తో గంటల తరబడి భేటీ కావటం ఆయన హయాంలోనే సాధ్యమైందని చెప్పాలి. గవర్నర్ అంటే రబ్బర్ స్టాంప్ అన్నట్లుగా పేరున్న దానికి భిన్నంగా యాక్టివ్ గా వ్యవహరించటమే కాదు.. రాష్ట్ర ముఖ్యమంత్రులకు పెద్దన్న మాదిరి వ్యవహరించటంలో ఆయన సక్సెస్ అయ్యారని చెప్పాలి.
2010 జనవరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా నియమితులైన ఆయన.. నాన్ స్టాప్ గా తొమ్మిదేళ్లకు పైనే గవర్నర్ గా వ్యవహరించటం విశేషం. ఈ స్థాయిలో మరో గవర్నర్ పదవిని చేపట్టటం ఇప్పట్లో కష్టమనే మాట వినిపిస్తోంది. అంతేనా.. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్ ను.. మోడీ సర్కారు కంటిన్యూ చేయటం కూడా నరసింహన్ కు మాత్రమే సాధ్యమయ్యే రికార్డుగానే చెప్పాలి.
అంతేకాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి గవర్నర్ గా.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు తొలి గవర్నర్ గా ఆయన రికార్డు శాశ్వితంగా నిలిచిపోతుంది. అంతేనా.. తన పదవీ కాలంలో గవర్నర్ నరసింహన్ ఏకంగా ఆరుగురు ముఖ్యమంత్రుల చేత ప్రమాణస్వీకారాలు చేయించారు. ఒక గవర్నర్ తన పదవీ కాలంలో ఇంత మంది ముఖ్యమంత్రుల చేత పదవీ ప్రమాణస్వీకారం చేయించటం మామూలు విషయం కాదు.
రెండు తెలుగు రాష్ట్రాలకు పూర్తి కాలం గవర్నర్ గా పని చేసిన రికార్డును తన సొంతం చేసుకున్నారు. తనకు అప్పగించిన ఏ బాధ్యతనైనా సరే.. నూటికి నూరుశాతం న్యాయం చేసినట్లుగా నరసింహన్ గురించి చెబుతారు. అంతేకాదు.. మరే గవర్నర్ కు సాధ్యం కాని రీతిలో.. తాను పదవిలో ఉన్న తొమ్మిదేళ్లలో గవర్నర్ తన వెంట సతీమణి విమలా నరసింహన్ ను వెంట తీసుకెళ్లటమే కాదు.. గవర్నర్ తర్వాత అంతలా పాపులర్ అయిన మిసెస్ గవర్నర్ గా విమలా తెలుగువారి మనసుల్లో నిలిచిపోతారు. మొత్తంగా.. తన తొమ్మిదేళ్ల గవర్నర్ గిరిలో నరసింహన్ నెలకొల్పిన రికార్డుల్ని సమీప భవిష్యత్తులో ఎవరూ బ్రేక్ చేసే అవకాశం లేదని చెప్పక తప్పదు.