మోడీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి పర్చాలని భావిస్తున్న 20 స్మార్ట్ సిటీలకు సంబంధించిన జాబితాను కేంద్రం ప్రకటించింది. తాజాగా ప్రకటించిన స్మార్ట్ సిటీ జాబితాలో ఆసక్తికర అంశాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ప్రకటించిన 20 నగరాల్లో కొన్ని రాష్ట్రాలకే చోటు దక్కటం గమనార్హం. ఏపీకి రెండు స్మార్ట్ నగరాలు దక్కితే.. తెలంగాణ రాష్ట్రానికి ఒక్క స్మార్ట్ సిటీ దక్కకపోవటం గమనార్హం. తెలంగాణతో పాటు.. ఇటీవల దారుణ పరాజయం పాలైన బీహార్ రాష్ట్రానికి కూడా ఒక్క స్మార్ట్ సిటీ దక్కకపోవటం విశేషం. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన జమ్మూకాశ్శీర్ రాష్ట్రానికి కూడా స్మార్ట్ సిటీల జాబితాలో చోటు దక్కలేదు. గడిచిన 19 నెలల్లో ప్రధాని తెలంగాణ రాష్ట్రానికి రావటం లేదంటూ తెలంగాణ అధికారపక్షం తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న వేళ.. స్మార్ట్ సిటీ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క నగరం కూడా ప్రకటించలేదు.
కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీలు ఏవంటే..
- భువనేశ్వర్ (ఒడిశా)
- ఉదయ్ పూర్ (రాజస్థాన్)
- జయపుర (రాజస్థాన్)
- సూరత్ (గుజరాత్)
- అహ్మదాబాద్ (గుజరాత్)
- కోచి (కేరళ)
- జబల్ పూర్ (మధ్యప్రదేశ్)
- న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్
- విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)
- కాకినాడ (ఆంధ్రప్రదేశ్)
- షోలాపూర్ (మహారాష్ట్ర)
- పుణె (మహారాష్ట్ర)
- బెళగావి (కర్ణాటక)
- దావణగెరె (కర్ణాటక)
- గువహటి (అపోం)
- చెన్నై (తమిళనాడు)
- కోయంబత్తూర్ (తమిళనాడు)
- లూథియానా (పంజాబ్)
- భోపాల్ (మధ్యప్రదేశ్)
- ఇండోర్ (మధ్యప్రదేశ్)
కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీలు ఏవంటే..
- భువనేశ్వర్ (ఒడిశా)
- ఉదయ్ పూర్ (రాజస్థాన్)
- జయపుర (రాజస్థాన్)
- సూరత్ (గుజరాత్)
- అహ్మదాబాద్ (గుజరాత్)
- కోచి (కేరళ)
- జబల్ పూర్ (మధ్యప్రదేశ్)
- న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్
- విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)
- కాకినాడ (ఆంధ్రప్రదేశ్)
- షోలాపూర్ (మహారాష్ట్ర)
- పుణె (మహారాష్ట్ర)
- బెళగావి (కర్ణాటక)
- దావణగెరె (కర్ణాటక)
- గువహటి (అపోం)
- చెన్నై (తమిళనాడు)
- కోయంబత్తూర్ (తమిళనాడు)
- లూథియానా (పంజాబ్)
- భోపాల్ (మధ్యప్రదేశ్)
- ఇండోర్ (మధ్యప్రదేశ్)