పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం తర్వాత.. ఎప్పటికప్పుడు.. అవసరానికి తగ్గట్లుగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నకేంద్రం తాజాగా కీలకనిర్ణయాన్ని తీసుకుంది. నగదు రహిత చెల్లింపుల్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఉన్న కేంద్రం.. అందుకు తగ్గట్లే ఇకపై ఉద్యోగులకు ఇచ్చే జీతాలు.. వేతనాల్ని చెల్లించే విధానంలో కొత్త మార్పును చేసింది.
అయితే.. చెక్కుల ద్వారా ఇవ్వటం కానీ లేదంటే నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సిందిగా చట్టాన్ని మారుస్తూ ఆదేశాల్ని జారీ చేసింది. వేతనాల చెల్లింపు సవరణ బిల్లు 2016ను ఈ నెల 15న లోక్ సభలో మోడీ సర్కారు ప్రవేశ పెట్టింది. అయితే.. ఈ బిల్లు పార్లమెంట్ లో చర్చకు రాలేదు. దీంతో.. అత్యవసర పరిస్థితుల్లో ఆర్డినెన్స్ రూపంలో ఈ నిర్ణయాన్ని జారీ చేశారు.
ఏదైనా కీలక అంశంలో చట్టాన్ని చేసే వీలు లేనప్పుడు.. ఆర్డినెన్స్ రూపంలో ఆదేశాలు జారీ చేస్తారు. అనంతరం పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరిపి.. ఆమోదం పొందేలా చూస్తారు. తాజాగా విడుదల చేసిన ఆర్డినెన్స్ నేపథ్యంలో ఇకపై ఉద్యోగులకు ఇచ్చే జీతాల్ని.. వేతనాల్ని నగదు రూపంలో ఇచ్చే అవకాశం పూర్తిగా మూసుకుపోనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/