సర్కారీ స్కూళ్లలో మధ్యాహ్నం భోజనం అన్నంతనే.. అదెలా ఉంటుందన్న విషయం గురించి తెలిసిందే. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో మధ్యాహ్నం భోజన నాణ్యత కాస్త మెరుగ్గానే ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
సరైన రీతిలో పిల్లలకు ఆహారం పెట్టేందుకు వీలుగా మెనూను మార్చటమే కాదు.. నియంత్రణ.. పర్యవేక్షణను పెంచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. దేశంలోని మరే రాష్ట్ర ముఖ్యమంత్రికి రాని సరికొత్త ఐడియా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వచ్చేసింది.
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని.. స్కూల్ విద్యార్థులకు అందజేసే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా.. వారానికి ఒక్కరోజు చికెన్ ను వడ్డించాలని డిసైడ్ చేశారు. చికెన్ తో పాటు.. మరో రోజు సీజనల్ పండ్లను కూడా అందజేయాలని డిసైడ్ చేశారు. అక్కడికే ఆగకుండా జనవరి నుంచి ఏప్రిల్ చివరి వరకు ఉన్న రోజులకు ఈ కొత్త మెనూకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేయటం ఆసక్తికరంగా మారింది.
రానున్న నాలుగు నెలలకు అవసరమైన చికెన్.. పండ్ల కోసం అవసరమైన రూ.371 కోట్లను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రచ్చగా మారింది. మొదట్లో దీదీ సర్కారు తీసుకున్న నిర్ణయం విపక్షాలకు సైతం ఒక పట్టాన అర్థం కాలేదని చెబుతున్నారు. కాస్తంత లోతుగా ఆలోచిస్తే..అసలు విషయం అర్థమై. దీదీనా మజాకానా? అనే పరిస్థితిగా మారిందంటున్నారు. ఈ ఏడాదిలో పశ్చిమ బెంగాల్ లో జరిగే పంచాయితీ ఎన్నికలకు ముందస్తుగానే మమతమ్మ చికెన్ ప్లాన్ తో సిద్ధమైనట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. మమతా సర్కారు అమలు చేసే ఈ చికెన్ వడ్డింపు విషయంలో కేంద్రం సైతం 40 శాతం ఖర్చును షేర్ చేసుకోవటం. అంటే.. తన రాజకీయ ప్రత్యర్థి పవర్ లో ఉన్న సెంట్రల్ నుంచి నిధులు ఇప్పించుకొని.. వాటిని తన ఎన్నికల ఎజెండాకు తగ్గట్లు సిద్ధం చేసుకోవటం చూస్తే.. మమతమ్మ తెలివే తెలివని అంటున్నారు.
మరి.. ఈ ఐడియాను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరు ముందు పట్టేస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. కొద్దిపాటి ఖర్చుతో భారీ మైలేజీ పొందటమే కాదు.. ఖర్చులో 40 శాతం షేర్ ను కేంద్రం నుంచి తెచ్చుకొని.. వంద శాతం క్రెడిట్ ను సొంతం చేసుకునే చికెన్ ప్లాన్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల్లో ఎవరు ఇట్టే ఒడిసి పట్టుకుంటారు? అన్నది ప్రశ్నగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.