గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు : జంబో బ్యాలెట్‌ పేపర్ , జంబో బ్యాలెట్‌ బాక్స్ !

Update: 2021-03-03 05:55 GMT
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకి అధికారులు సర్వం సిద్ధం చేసే పనిలో నిమగ్నమైయ్యారు.  నల్గొండ-వరంగల్‌-ఖమ్మం ఎమ్మెల్సీ బరిలో 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 93 మంది ఉన్నారు. ఈ రెండు స్థానాలకు మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. మార్చి 17న ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్ ‌నగర్ స్థానం నుంచి టీఆర్‌ ఎస్‌ అభ్యర్థిగా సురభి వాణీదేవి రంగంలోకి దిగారు. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్‌ ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రాములు నాయక్‌ తో పాటు టీజేఎస్ అభ్యర్థిగా కోదండరాం, జయసారధి రెడ్డి, తీన్‌మార్‌ మల్లన్న, ప్రేమేందర్‌ రెడ్డి, రాణిరుద్రమ దేవి వంటి ప్రముఖులు పోటీపడుతున్నారు.

ఇక ఈసారి  ఖమ్మం-నల్లగొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో ఏకంగా 71 మంది ఉండటంతో భారీ బ్యాలెట్‌ పేపర్‌ సిద్ధమవుతోంది. నమూనా బ్యాలెట్‌ తయారు చేసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాష్ట్ర ఎన్నికల అధికారికి పంపించగా దానిని ఫైనల్‌ చేశారు. బ్యాలెట్‌ ముద్రణకు ముంబైకి పంపారు. అలాగే , పెద్ద బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. ఈ పరిదిలో మొత్తం 5,05,565మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. మొత్తం 731 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. పోటీలో 71 మంది ఉండటంతో 18్ఠ23 ఇంచుల బ్యాలెట్‌ పేపర్‌ ను ముద్రిస్తున్నారు. నాలుగు కాలాలుగా బ్యాలెట్‌ ను విభజిస్తున్నారు. ఒక్కో కాలానికి 20 మంది చొ ప్పున అభ్యర్థులు ఉంటారు. ఓటు వేసిన అనంత రం కాలం వారీగా బ్యాలెట్‌ పేపర్‌ ను ఫోల్డ్‌ చేసేలా తయారుచేస్తున్నారు. బ్యాలెట్‌ పేపర్‌ బారీ ఎత్తున ఉండడంతో దానికి అనుగుణంగా ఎన్నికల అధికారులు జంబో బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. 2్ఠ2్ఠ21/2 సైజులో బాక్సు ఉండేలా చూస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Tags:    

Similar News