మరికొద్ది గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటివరకూ 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం మంగళవారం ఉదయం 11.12 గంటల తర్వాత నుంచి 31 జిల్లాలుగా కానుంది. ఒక్క హైదరాబాద్ జిల్లా తప్పించి.. మిగిలిన తొమ్మిది జిల్లాలు కాస్తా 30 జిల్లాలుగా మారనున్నాయి. ఈ 30జిల్లాల్లో కొత్తవి 21 జిల్లాలుగా చెప్పొచ్చు. కొత్త జిల్లాల ఏర్పాటును భారీ ఎత్తున ప్రారంభించాలని తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నారు. నభూతో.. అన్న రీతిలో కొత్త జిల్లాల ఏర్పాటు భారీ వేడుకగా సాగాలని భావిస్తున్నారు.
ఇందుకు తగ్గట్లే పక్కా ప్లాన్ ను సిద్ధం చేశారు.కొత్త జిల్లాల నోటిఫికేషన్ సోమవారం అర్థరాత్రి 12 గంటల తర్వాత విడుదల కానున్నప్పటికీ.. ఇప్పటికే అంతర్గత ఆదేశాలతో అధికారగణం కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన పనులు పూర్తి చేస్తున్నారు. మొదట్లో అనుకున్నట్లు కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు జిల్లాలకు కాకుండా.. సిద్ధిపేట జిల్లా ఓపెనింగ్ కే పరిమితం కానున్నారు. మంత్రి కమ్ మేనల్లుడు ప్రాతినిధ్యం వహించే సిద్ధిపేటను జిల్లాగా కేసీఆర్ తన చేతల మీదుగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం మంత్రి హరీశ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరీ భారీ ఏర్పాట్లు చేయటం గమనార్హం.
మేనమామ కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు వీలుగా.. సిద్ధిపేటలో జరుగుతున్న ఏర్పాట్లు వింటే అవాక్కు కావాల్సిందే. అంత భారీగా.. పనులు నిర్వహిస్తున్నట్లుగా చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు కార్యక్రమం భారీగా జరుగుతున్నప్పటికీ.. సిద్ధిపేట జిల్లా ఓపెనింగ్ అదిరిపోయేలా ఉడాలని భావిస్తున్నారు. ఇందుకోసం హరీశ్ ప్రత్యేకంగా ఒక ప్లాన్ సిద్ధం చేశారు. దాని ప్రకారం చూస్తే..
= సిద్ధిపేటను పూలవనంగా మార్చనున్నారు. పట్టణం నలుమూలలా భారీ కటౌట్లు.. రంగురంగు జెండాలతో సిద్ధిపేట పట్టణానికి కొత్త వెలుగులు తీసుకొచ్చేలా ఏర్పాట్లు.
= పట్టణం నలుమూలల భారీ కటౌట్లు.. రంగు రంగు జెండాల ఏర్పాటు.
= సిద్ధిపేట లోని ప్రభుత్వ కార్యాలయాలు.. భవనాలు.. ముఖ్యమైన అన్ని చౌరస్తాలకు ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరణ
= ఉద్యోగులు.. ఉపాధ్యాయ సంఘాలు.. ఇతరులతో కలిపి కిలోమీటరు మేర ర్యాలీ నిర్వహణ
= కలెక్టరేట్ భవనం నుంచి.. పాతబస్టాండ్ వరకు 6200 మందితో కలిపి ముఖ్యమంత్రికి దారి పొడువునా స్వాగతం పలకటం
= సీఎంకు దారి పొడువునా మంగళహారతులు.. అడుగడుగునా పూలు చల్లటం.. 50 వేల గాలి బుడగలను గాల్లోకి ఎగురవేయటం
= భారీ ఎత్తున బాణసంచాను కాల్చటం
= సికింద్రాబాద్ లష్కర్ బోనాల్లో పాల్గొనే వేయి మంది కళాకారులతో కళారూపాలు
= 200 మంది వేద పండితులతో పాటు.. వివిధ వర్గాలకు చెందిన తొమ్మిది మంది పెద్దలతో సర్వమత ప్రార్థనలు
= కొత్తజిల్లా ఆవిర్బావ వేడుకలను పురస్కరించుకొని మొత్తం 60 వేల లడ్డూల్ని పంచటం. దీనికి అదనంగా జిలేబీ పంపిణీ
= జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఐదు వేల మంది వరకు టీఆర్ఎస్ శ్రేణుల్ని తరలించి.. జిల్లా ఏర్పాటు అనంతరం ఏర్పాటు చేసే బహిరంగ సభకు హాజరయ్యేలా చూడటం