ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు !

Update: 2020-01-08 09:16 GMT
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు ఉన్న అడ్డంకులు తొలిగి పోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెల 13న అన్ని రాజకీయ పార్టీల ప్రతి నిధులతో ఎన్నికల సంఘం ప్రతినిధులు భేటీ కానున్నారు. అలాగే ఈ నెల 17న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. వచ్చే నెల 15లోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు తెలిపింది.

ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 3వ తేదీ నాటికి పంచాయతీ ఎన్నికలు పూర్తి  చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు దశల్లో మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన ప్రమాణ పత్రానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో వైపు 59.58 శాతం అమలు పై  స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ ను హైకోర్టు కొట్టేసింది.. జీ వో నెంబర్ 176పై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం సముఖత వ్యక్తం చేయలేదు. ఏపీలో జగన్ సర్కార్ ఏర్పడిన తరువాత వచ్చిన మొట్టమొదటి ఎన్నికలు ఇవే కావడం తో ఈ ఎన్నికలు ప్రభుత్వానికి , ప్రతిపక్షానికి కీలకం కాబోతున్నాయి. దీనిపై ఇప్పటికే ఇరు పార్టీల నేతలు ,..స్థానిక నేతలతో సమావేశం అయ్యి , వారికీ దిశా నిర్దేశం చేస్తున్నారు.


Tags:    

Similar News