జీఎస్టీ భారాల పరంపరకు బ్రేక్ పడి ఓ తీపి కబురు వినిపించింది. టీవీలు, కంప్యూటర్ల పై పన్ను శాతాన్ని తగ్గించారు. సిమెంటు, ఆటో పార్ట్స్ పై జీఎస్టీని తగ్గించలేదు. ఇవాళ జీఎస్టీ మండలి ఢిల్లీలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. కేవలం విలాసవంతమైన వస్తువులు మాత్రమే 28 శాతం పన్ను శ్లాబులో ఉంటాయని మంత్రి తెలిపారు. తాజా నిర్ణయంతో కేవలం 28 శాతం వస్తువులు మాత్రమే 28 శాతం పన్ను శ్లాబులో ఉంటాయని జైట్లీ చెప్పారు.
వచ్చే జీఎస్టీ మండలి సమావేశంలో రియల్ ఎస్టేట్ పై నిర్ణయం తీసుకోనున్నట్లు ఉత్తరాఖండ్ మంత్రి ప్రకాశ్ పంత్ తెలిపారు. 100 రూపాయల ధర ఉండే సినిమా టికెట్ పై పన్ను శాతాన్ని 12 శాతానికి తగ్గించినట్లు మంత్రి జైట్లీ తెలిపారు. వంద కన్నా ఎక్కువ ఉన్న టికెట్ ధరలను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. మానిటర్లు- టీవీ స్క్రీన్లు- టైర్లు- పవర్ బ్యాంకులు- లిథియమ్ బ్యాటరీల పై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దివ్యాంగులు వాడే పరికరాల పై 5 శాతం పన్ను వసూల్ చేయనున్నారు. జనవరి ఒకటి, 2019 నుంచి కొత్త జీఎస్టీ అమలులోకి వస్తుందని మంత్రి చెప్పారు.
ఈ ఏడాదిలో జీఎస్టీని మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పన్ను సంస్కరణ లో భాగంగా జీఎస్టీ విధానాన్ని తీసుకువచ్చారు. దీంతో అనేక వస్తువులను 28 నుంచి 5 శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. వాస్తవానికి దాదాపు 99 శాతం వస్తువులను 18 శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనుకుంటున్న ఈ మధ్య కేంద్రం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పలు రాష్ర్టాల ఎన్నికలు, వివిధ రాష్ర్టాల వారు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ మేరకు సవరణ చేశారు.
కాగా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ను 33 వస్తువులపై తగ్గించారు. 33 వస్తువుల పై ఉన్న 18 శాతం జీఎస్టీని.. 12 శాతానికి తగ్గించినట్లు పుదుచ్చరి సీఎం వి. నారాయణస్వామి తెలిపారు. మరికొన్ని వస్తువులను 5 శాతం పరిధిలోకి తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు. సాధారణ ప్రజలకు అవసరమైన సరకులను ఈ పరిధిలోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.