నారా లోకేష్ దూకుడు పెంచారు. నోటికి పని చెప్పారు. అనను అంటూనే వైసీపీ మహిళల మీద ఆయన కామెంట్స్ చేస్తున్నారు. ఇక జగన్ సతీమణి వైఎస్ భారతి మీద ఆయన చేసిన కామెంట్స్ కి మంత్రి గుడివాడ అమరనాధ్ అంతే రేంజిలో ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఆడవాళ్ల మీద కాదు నీ ప్రతాపం, చేతనైతే మాతో మాట్లాడు, నీవు మమ్మల్ని ఒకటి అంటే మేము పది బదులిస్తామని గుడివాడ ఫైర్ అయ్యారు. లేకి మాటలు వద్దు లోకేశా అని గట్టిగానే విరుచుకుపడ్డారు.
మేను కనుక ఒక మాట అంటే తండ్రీ కొడుకులు ఇద్దరూ ఇంట్లో కూర్చుని బోరున ఏడుస్తారు అని గుడివాడ అనడం విశేషం. లోకేష్ ది వైట్ లాస్ కాదు మైండ్ లాస్ అని పంచులే వేశారు. వైసీపీ వారికి ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే నీచ సంస్కృతి తెలియదు అని టీడీపీ వారితో అలా అనిపించాలని లోకేష్ చూస్త ఊరుకోమని అన్నారు.
వైఎస్ భారతి రాజకీయాల్లో లేరు, ఆమె మీద అవాకుకు చవాకులు పేలితే మాత్రం తాట తీస్తామని లోకేష్ కే వార్నింగ్ ఇచ్చేశారు.
ఇంట్లో ఆడవారి మీద మాట్లాడకూడదన్న రాజకీయ పరిజ్ఞానం కూడా లోకేష్ కి లేకుండా పోయిందని అన్నారు. తన భార్య బ్రాహ్మణి విషయంలో ఏమైనా గొడవలు ఉంటే దాన్ని ఇంట్లో చూసుకోవాలని, ఆ అసహనాన్ని బయట చూపించాలనుకుంటే తాము ఊరుకోమని కూడా హెచ్చరించారు.
ఇక పోతే తెలుగుదేశం హయాంలో ఏం పెట్టుబడులు వచ్చాయని లోకేష్ గట్టిగా మాట్లాడుతున్నారని గుడివాడ మండిపడ్డారు. ముందు అయిదేళ్ళలో టీడీపీ తెచ్చిన పరిశ్రమలు ఏంటో కల్పించిన ఉపాధి ఏమిటో శ్వేతపత్రం రిలీజ్ చేయ్ డిబేట్ కి నేను రెడీ అని గుడివాడ సవాల్ చేశారు.
జనసేనకు ముందు స్వాతంత్రం ఇప్పించుకుని ఆ మీదట తన రాజకీయం గురించి పవన్ మాట్లాడితే బాగుంటుందని గుడివాడ సలహా ఇచ్చారు. ఏపీలో 175 ఎమ్మెల్యే, పాతిక ఎంపీ సీట్లలో పోటీ చేయగలమని జనసేన అధినేత చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. జనసేన కాపులది కాదని, కమ్మ జనసేన అని గుడివాడ సెటైర్లు వేశారు. చంద్రబాబు స్క్రిప్ట్ నాదెండ్ల మనోహర్ డైరెక్షన్ లో ఆ పార్టీ పనిచేస్తోందని గుడివాడ విమర్శించారు.