దుబాయ్ మీడియా ఫ‌స్ట్ పేజీలో శ్రీ‌దేవే!

Update: 2018-02-25 23:07 GMT
శ్రీ‌దేవంటే శ్రీ‌దేవే. వేరే మాటే లేదు. శ్రీ‌దేవి మ‌ర‌ణం యావ‌ద్దేశాన్ని ఎంత షాక్ కు గురి చేసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆమె మ‌ర‌ణ‌వార్త‌ను మీడియా అంతా భారీగా క‌వ‌ర్ చేశారు. నిజం చెప్పాలంటే.. చాలా ఛాన‌ళ్లు శ్రీ‌దేవి మ‌ర‌ణం మీద మాత్ర‌మే ప‌ని చేశాయి. త‌మ రోజువారీ కార్య‌క్ర‌మాల‌కు క‌ట్ చెప్పాయి. అంతేనా.. త‌మ న్యూస్ లో 95 శాతం శ్రీ‌దేవి.. శ్రీ‌దేవి.. శ్రీ‌దేవి నామ‌స్మ‌ర‌ణ చేశాయి.

ఆమెను ఎన్ని ర‌కాలుగా గుర్తుకు తెచ్చుకోవాలో అన్ని ర‌కాలుగా గుర్తుకు తెచ్చే ప్ర‌య‌త్నం చేశాయి. ఒక్క‌మాట‌లో చెప్పాలంటూ దేశీయ మీడియా సంస్థ‌ల‌న్నీ శ్రీ‌దేవి జపం చేశాయి. శ్రీ‌దేవి అంటే పెద్ద‌గా ప‌రిచ‌యం లేని చోట కూడా ఆమె మ‌ర‌ణవార్త‌కు భారీ ప్ర‌యారిటీ ఇచ్చారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. దుబాయ్ మీడియాలోనూ శ్రీ‌దేవికి ఇచ్చిన ప్ర‌యారిటీ అంతా ఇంతా కాదు. ఖ‌లీజ్ టైమ్స్ త‌న ఈ పేప‌ర్లో నిలువెత్తు శ్రీ‌దేవి బొమ్మ‌ను అచ్చేసి.. చాందిని గోస్ ఆఫ్ అంటూ హెడ్డింగ్ పెట్టేశారు. అంతేనా.. దుబాయ్ కు చెందిన ప‌లు ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు త‌మ మీడియాలో శ్రీ‌దేవి మ‌ర‌ణ‌వార్త‌కు ప్రాధాన్య‌త‌ను ఇచ్చాయి.

ద గ‌ల్ఫ్ టుడే ఈ పేప‌ర్ మొద‌టిపేజీలోనూ శ్రీ‌దేవి మ‌ర‌ణ‌వార్త‌ను ఇచ్చారు. గ‌ల్ఫ్ టైమ్స్ క‌మ్యూనిటీ విభాగంలో అయితే.. శ్రీ‌దేవి ఫోటోను పేజీ మొత్తంగా వేసేయ‌ట‌మే కాదు.. రెండు పేజీలు శ్రీ‌దేవి గురించి ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ప‌బ్లిష్ చేశారు. ఐకాన్ గా అభివ‌ర్ణించ‌ట‌మే కాదు.. ఆమె స్టోరీకి హెడ్డింగ్ గా.. 50 ఇయ‌ర్స్ ఆఫ్ లివింగ్ సినిమాటిక్ డ్రీమ్ అంటూ హెడ్డింగ్ పెట్టారు. ఇలా చాలా మీడియా సంస్థ‌ల‌కు చెందిన ఈ పేప‌ర్ల‌లో శ్రీ‌దేవి వార్త‌నే హైలెట్ చేయ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News