ఎంపీ బ్యాంక్ ఖాతా నుంచి 20ల‌క్ష‌లు హుష్ కాకి!

Update: 2019-02-13 07:34 GMT
సాంకేతిక పెరిగిన వేళ‌.. ఆచితూచి అడుగులు వేయాల్సిందే. మ‌నం జాగ్ర‌త్త‌గా ఉన్న‌ప్ప‌టికీ.. మ‌న మీద క‌న్ను ప‌డినోడు మ‌హా ముదురైతే మ‌న‌కు ఇక్క‌ట్లు త‌ప్ప‌వు. సాంకేతిక‌త పెరిగిన పోయిన వేళ‌.. సెక్యురిటీ ఎంత టైట్ చేసినా.. ఆన్ లైన్ ఖాతాల‌తో ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొనే ప‌రిస్థితి. తాజాగా ఇలాంటి చేదు అనుభ‌వ‌మే క‌ర్ణాట‌కకు చెందిన మ‌హిళా ఎంపీకి ఎదురైంది.

ఆమె బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసిన గుర్తు తెలియ‌ని దుండ‌గ‌లు.. ఆమె అకౌంట్లో ఉన్న‌ రూ.20ల‌క్ష‌ల్ని మాయం చేసిన వైనం సంచ‌ల‌నంగా మారింది. ఇంత‌కీ ఆ మ‌హిళా ఎంపీ ఎవ‌రో కాదు.. మంగ‌ళూరు బీజేపీ ఎంపీ శోభాకంర‌ద్లాజే. ఆమెకు ఎస్ బీఐలో బ్యాంక్ ఖాతా ఉంది. తాజాగా ఆమె ఖాతాను ఎవ‌రో హ్యాక్ చేశారు. రూ.20ల‌క్ష‌ల మొత్తాన్ని త‌ర‌లించేశారు.

ఈ విష‌యాన్ని ఆల‌స్యంగా గుర్తించిన ఆమె.. ఆ విష‌యాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. త‌న ఖాతాను హ్యాక్ చేసి రూ.20ల‌క్ష‌లు మాయం చేసిన వైనం బ‌య‌ట‌కు వ‌స్తే ఇబ్బందిగా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌తో ఈ ఇష్యూను ఆమె బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని చెబుతున్నారు.

తాజాగా ఆమె.. ఢిల్లీలోని  పార్ల‌మెంటు భ‌వ‌న్ మార్గంలోని పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. ప్ర‌తి ఎంపీకి పార్ల‌మెంటు భ‌వ‌న్ లోని ఎస్ బీఐలో ఖాతా తెరుస్తారు. పార్ల‌మెంటు ప‌రిధిలోని బ్యాంకు ఖాతానే హ్యాక్ చేయ‌టం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. ఇంత‌కీ.. ఎంపీగారి ఖాతా హ్యాక్ కావ‌టానికి కార‌ణాలు ఏమిట‌న్న‌ది బ‌య‌ట‌కు రాలేదు. ఆమె నిర్ల‌క్ష్య‌మా?  బ్యాంక్ సిబ్బంది త‌ప్పా? అన్న‌ది తేల్లేదు.
    

Tags:    

Similar News