భారతీయ జనతా పార్టీ తీసుకున్న విరాళాల్లో సగం నిధులు ఒకే సంస్థ నుంచి రావడం ఆసక్తిదాయకంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ తను తీసుకున్న విరాళాల వివరాలు అందించింది. మొత్తం ఏడు వందల కోట్ల రూపాయల మొత్తాలను ఆ పార్టీ తీసుకుందట.
ఈ మొత్తం అంతా అధికారికంగా తీసుకున్నదే. అది కూడా చెక్కులు, ఆన్ లైన్ పేమెంట్ల ద్వారానే ఈ నిధులు వచ్చినట్టుగా బీజేపీ పేర్కొంది. అయితే ఈ ఏడువందల కోట్ల రూపాయల్లో సగానికి పైగా మొత్తం ఒక ప్రముఖ సంస్థ నుంచినే రావడం గమనార్హం.
అలా బీజేపీకి భారీ ఫండ్ ఇచ్చినది మరెవరో కాదు, టాటా వాళ్లు! దేశంలోనే ప్రముఖ-వివిధ రంగాల్లో విస్తరించి ఉన్న టాటా తన ఆధ్వర్యంలోని ఎలక్ట్రోట్రల్ ట్రస్టు ద్వారా ఏకంగా మూడువందల యాభై ఆరు కోట్ల రూపాయలను భారతీయ జనతా పార్టీకి విరాళంగా ఇవ్వడం విశేషం. బీజేపీకి వచ్చిందే ఏడు వందల కోట్ల రూపాయలు అంటే అందులో సగం మొత్తాన్ని టాటా మాత్రమే ఇచ్చింది.
ఇలా బీజేపీకి టాటా సంస్థ మహారాజ పోషకులుగా నిలుస్తోంది. మరో యాభై నాలుగు కోట్ల రూపాయల మొత్తాన్ని ఇంకో సంస్థ బీజేపీకి డోనేట్ చేసింది. ఇలా రెండే సంస్థలు నాలుగు వందల కోట్ల రూపాయలను ఒక్క ఏడాది కాలంలో బీజేపీకి ఇచ్చాయి. ఇంత పెద్ద దేశంలో మిగతా కంపెనీలన్నీ కలిపి మరో మూడు వందల కోట్ల రూపాయల మొత్తాన్ని చెక్కులు, ఆన్ లైన్ పేమెంట్ల రూపంలో చేస్తే, రెండే సంస్థలు నాలుగు వందల కోట్ల రూపాయలు బీజేపీకి కానుకగా ఇచ్చాయి.