భారత క్రికెట్ జట్టులోకి రాకముందు అనామకులుగా.. అష్టకష్టాల్లో ఉండే క్రికెటర్లు.. క్రికెట్ లో వెలుగు వెలిగాక ఆటతో కంటే లగ్జరీ లైఫ్ తో వార్తల్లోకెక్కుతారు. తమ కష్టాలు తీరిపోవడంతో రిలాక్స్ అవ్వడంతోపాటు ఆటను గతి తప్పేలా చేసుకుంటారు. తాజాగా అరంగేట్రంలోనే సత్తా చాటిన టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యా, ప్రేమ వివాహం.. లగ్జరీ ఎంజాయ్ మెంట్ తో సరిగా రాణించడం లేదని.. జట్టులో చోటు కోల్పోయాడన్న టాక్ నడిచింది.
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఇప్పటికీ ఆధునిక అల్ట్రా మోడల్ లైఫ్ స్టైల్ ను మెయింటేన్ చేస్తుంటాడు. అత్యంత విలాసవంతమైన జీవనశైలిని నడిపిస్తాడు. అతను తరచుగా ముంబై వీధుల్లో కనిపిస్తాడు, తన టాప్-బిల్ లంబోర్ఘిని హురాకాన్ ఈవోవీ కారుపై రయ్ రయ్ మంటూ చక్కర్లు కొడుతుంటాడు. లేదంటే మెర్సిడెస్ బెంజ్ కారుపై స్వారీ చేస్తుంటాడు. ఇవి అతని విలాసవంతమైన ఆస్తులలో ఒక చిన్న భాగం మాత్రమే. అతడి ఎంజాయ్ మెంట్ లో చిన్న పార్ట్ మాత్రమే.
హార్దిక్ ఇటీవల షేర్ చేసిన ఫొటోలో ఒక ఖరీదైన వాచ్ ను ధరించినట్టుగా కనిపించింది. హార్ధిక్ పటేక్ ఫిలిప్ నాటిలస్ ప్లాటినమ్ 5711 రిస్ట్ వాచ్‌ని ధరించాడు. దాని ధర ఏకంగా 5 కోట్ల రూపాయల ఉంటుంది. అంతటి ఖరీదైన వాచ్ ను పెట్టుకున్నాడంటే హార్ధిక్ ఎంతలా లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడో తెలుసుకోవచ్చు.
ఈ గడియారం ఒక కళాఖండం అని చెప్పొచ్చు. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ నాణ్యమైన ప్లాటినంతో తయారు చేయబడింది. ఇది ఆకుపచ్చ పచ్చలతో ఎంబ్రాయిడరీ చేయబడింది. ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాణిజ్యపరంగా విక్రయించబడే గడియారాలలో ఒకటిగా చెబుతుంటారు..
హార్దిక్ వద్ద పటెక్ ఫిలిప్ నాటిలస్ టైమ్ ట్రావెల్ వేరియంట్ కూడా ఉంది, దీని ధర 2.2 కోట్లు. అతను కొన్ని ఇతర సూపర్ లగ్జరీ గడియారాలను కూడా కలిగి ఉన్నాడు. కేవలం హార్దిక్ వాచ్ కలెక్షన్ రూ. 10 కోట్లు ఉంటుందని భోగట్టా. కేవలం వాచ్ ల కోసమే రూ.10 కోట్లు ఖర్చు పెడుతున్నాడంటే ఇతడి సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం స్టార్ ఆటగాడు యుఏఈలో ఉన్నాడు. ఐపిఎల్ 2021 రెండవ దశ కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే 5 సార్లు ఐపిఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు హార్ధిక్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.