గుజ‌రాత్‌ లో టెన్ష‌న్‌.. హార్దిక్ ప‌టేల్ అరెస్టు

Update: 2015-09-19 06:57 GMT
గుజ‌రాత్‌ లో రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాటం చేస్తున్న ఉద్య‌మ నేత హార్దిక్ ప‌టేల్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. ప‌టేళ్ల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని ఆయ‌న ఏక్తా యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో పోలీసులు ఆయ‌న్ను క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. హార్దిక్ యాత్ర‌లో ఉద్రిక్త‌త‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని భావించిన పోలీసులు ముందుగానే ఆయ‌న‌తో పాటు మ‌రో 78 మందిని అదుపులోకి తీసుకున్నారు.

సూర‌త్‌ లో హార్దిక్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అత‌డిని వార‌చ్చా పోలీస్‌ స్టేష‌న్‌ కు త‌ర‌లించారు. దీంతో రాజ‌ధాని అహ్మ‌దాబాద్‌ లో ఎక్క‌డ చూసినా టెన్ష‌న్ టెన్ష‌న్‌ గా వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో కూడా ఎవ్వ‌రు చెప్ప‌లేక‌పోతున్నారు. ప్ర‌తి వీధిలోను పోలీసులు గ‌స్తీను ముమ్మ‌రం చేశారు.

కొద్ది రోజులుగా ప‌టేళ్ల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని ప‌టేదార్ అనామ‌త్ ఆందోళ‌న్ స‌మితి (పీఏఏఎస్‌) ఆధ్వ‌ర్యంలో చేస్తున్న ఉద్య‌మానికి హార్దిక్ క‌న్వీన‌ర్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో హార్దిక్ ఒక్క‌సారిగా దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. గుజ‌రాత్‌ లో స్టార్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ అయ్యాడు. ప‌టేల్‌ ను ఎదుర్కొనేందుకు గుజ‌రాత్ ప్ర‌భుత్వం నానా పాట్లు ప‌డుతోంది. చివ‌ర‌కు ఉద్య‌మ నేత‌ల పిలుపున‌కు స్పందించి గుజ‌రాత్ వ్యాప్తంగా ప‌టేళ్లు బ్యాంకు డిపాజిట్ల‌ను కూడా ఉప‌సంహ‌రించుకున్నారు. పీఎం మోడీ సొంత రాష్ర్ట‌మైన గుజ‌రాత్‌ లో ఇంత పెద్ద ఎత్తున ఉద్య‌మం జ‌రుగుతున్నా ఆయ‌న మాత్రం ప్ర‌జ‌లు శాంతియుతంగా ఉండాల‌ని చిన్న ట్వీట్ చేసి స‌రిపెట్టారు. ఈ ఉద్య‌మం రాష్ర్ట ప్ర‌భుత్వాన్ని అత‌లాకుత‌లం చేస్తున్నా మోడీ మౌనంగా ఎందుకు ఉంటున్నారో అంతు చిక్క‌డం లేదు.
Tags:    

Similar News