ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయా? అంటే.. అవుననే మాట వినిపిస్తోంది. ఊహించని రీతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యేలా కొన్ని పరిణామాలు చోటు చేసుకునే వీలుందని చెబుతున్నారు. మొదట్నించి తమను పక్కన పెట్టి.. ఏ మాత్రం అవకాశం ఇవ్వని నందమూరి తారకరామారావు కుటుంబానికి చెందిన ముఖ్యవర్గం ఒకటి తమదైన శైలిలోపావులు కదిపినట్లుగా చెబుతున్నారు.
తండ్రి ఎన్టీఆర్ తో పాటు రాజకీయాల్లో ఆయనకు వెన్నంటి ఉన్న నందమూరి హరికృష్ణను ఇటీవల కాలంలో చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేయటం తెలిసిందే. తనను పక్కన పెట్టినా.. తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో ఇప్పటివరకూ సహనంగా ఉన్న హరికృష్ణ కుటుంబ సభ్యులు.. తాజాగా బాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హరికృష్ణ పార్టీ మారే అవకాశం ఉందని చెబుతున్నారు. తనతో పాటు.. తన కుమారుడు ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్.. మరో నటుడు కల్యాణ్ రామ్ లు కూడా జగన్ పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు. కొడుకుల సంగతి ఎలా ఉన్నా.. హరికృష్ణ అయితే జగన్ గూటికి చేరే వీలుందంటున్నారు.
రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినప్పటికీ పార్టీలోనూ.. పాలనాంశాల్లోనూ కీలక ప్రాధాన్యత ఇవ్వలేదన్న అసంతృప్తి హరికృష్ణలో ఉందని.. అది ఈ మధ్య మరింత ఎక్కువ అవుతుందని చెబుతున్నారు.
బాబు తనను తొక్కి పెట్టారన్న ఆవేదనను తన సన్నిహితుల వద్ద హరికృష్ణ చెప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ పార్టీలో చేరటం ద్వారా.. బాబుకు షాక్ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. బాబు పాలనలో అవినీతి భారీగా పెరిగిపోవటం.. సంక్షేమ కార్యక్రమాలు పెద్దగా లేకపోవటం.. 2014 సార్వత్రిక ఎన్నికల వేళ బాబు ఇచ్చిన హామీల్లో చాలావరకూ నెరవేర్చకపోవటంపై గుర్రుగా ఉన్న హరికృష్ణ.. జగన్ గూటికి వెళ్లే సమయం ఆసన్నమైందని చెబుతున్నారు. ఇప్పటికే పురంధేశ్వరి బాబుకు వైరి పక్షంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హరికృష్ణ కూడా జగన్ బాట పడితే.. మిగిలిన నందమూరి కుటుంబం బాబుకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.