హరీశ్ ఆగ్రహంలో చెప్పిన నిజం విన్నారా?

Update: 2016-09-17 04:54 GMT
ఎవరు ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక విషయంలో మెచ్చుకోక తప్పదు. తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. కాలంతో పరుగులు పెడుతున్నారనే చెప్పాలి. తాను పరుగులు పెడుతూ.. ప్రభుత్వ యంత్రాగాన్ని పరుగులు తీయిస్తున్న క్రెడిట్ తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి హరీశ్ రావుకు దక్కుతుంది. ప్రాజెక్టుల వారీగా డెడ్ లైన్లు పెట్టుకొని ఉరుకులు పరుగులు తీయిస్తున్న ఆయన..ఇప్పటికే పలుమార్లు పనులు జరుగుతున్న తీరుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా మరింత ఓపెన్ అయ్యారు.

వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో దేవాదుల ప్రాజెక్టు పనులతో పాటు.. ఎస్సారెస్పీ మొదటి.. రెండో దశ పనులు.. భూసేకరణ పురోగతి వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల పని తీరుపై హరీశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిద్రపోవటం లేదని.. మంత్రులు.. ఎమ్మెల్యేలను నిద్ర పోనివ్వటం లేదని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే నీటి కోసమని. ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టుకొని ప్రతి పొలానికీ నీరు ఇవ్వాలని భావిస్తున్నామని చెప్పిన హరీశ్ తెలంగాణ ఉద్యమం ఇంకా పూర్తి కాలేదన్నారు. తాపత్రయం ఇంకా కొనసాగుతోందని.. తెలంగాణ కోసం కోట్లాడినప్పుడు కూడా తామింతగా కష్టపడలేదంటూ అసలు విషయాన్ని చెప్పేశారు. దేవాదుల ప్రాజెక్టు భూసేకరణపై జరుగుతున్న ఆలస్యంపై అసహనం వ్యక్తం చేసిన హరీశ్..భూసేకరణలో వేగం పెంచాలన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కూడా తామింతగా కష్టపడలేదన్నహరీశ్.. ప్రాజెక్టుల కోసం  తామెంత కష్టపడుతున్న విషయాన్ని చెప్పేసినా.. ప్రభుత్వ యంత్రాంగంతో పని చేయించటం ఎంత కష్టమైన.. క్లిష్టమైన ప్రక్రియ అన్నవిషయాన్ని బాగా అర్థం చేసుకున్నట్టున్నారు.
Tags:    

Similar News