జ‌డ్జిపైకి షూ విసిరితే ఏం జ‌రిగిందంటే...

Update: 2017-03-31 17:15 GMT
సాక్షాత్తు న్యాయ‌స్థానంలోనే ఓ ముద్దాయి దురుసు ప్ర‌వ‌ర్త‌న క‌ల‌క‌లం సృష్టించింది. కోర్టులోనే ఓ నిందితుడు జడ్జిపైకి షూ విసిరేసిన ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బాలికను అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష, రూ. 2 లక్షల జరిమానా న్యాయమూర్తి విధించారు.   దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు ఆరుముగన్(56) న్యాయమూర్తిపైకి షూ విసిరేశాడు. న్యాయమూర్తి తన చైర్‌ లో ఉండగానే ఈ ఘటన జరిగింది.

ఈ పరిణామంతో కోర్టులో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది. కోర్టులో దురుసుగా ప్ర‌వ‌ర్తించిన‌ నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై మరో కేసు నమోదు చేశారు. అయితే ఆరుముగన్ 2014లో 11ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఆ కేసులో కోర్టు ఇవాళ తీర్పునిచ్చింది.

ఇదిలాఉండ‌గా...హిమాచల్‌ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసులో తనపై తన భార్యపై సీబీఐ తయారు చేసిన ఎఫ్‌ ఐఆర్‌ ను కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ ను కొట్టివేసింది. ఈమేరకు ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అంతే కాకుండా అక్టోబర్ 1 - 2015న వీరభద్రసింగ్‌ ను  కోర్టు అనుమతిలేకుండా అరెస్టు చేయరాదని, ప్రశ్నించరాదని హిమాచల్‌ ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేస్తున్నట్టు జస్టిస్ విపిన్ సంఘీ తీర్పులో పేర్కొన్నారు. వీరభద్రసింగ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ ను కొట్టివేస్తున్నట్టు తెలిపారు. ఈ కేసును సుప్రీం కోర్టు హిమాచల్‌ ప్రదేశ్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇదే కేసులో సీబీఐ అధికారులు ఇవాళ సీబీఐ కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జీషీట్‌ లో వీరభద్రసింగ్‌ తో పాటు ఆయన భార్య ప్రతిభాసింగ్ ఇతరుల పేర్లను పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News