అసలైన హిందూ ఎమ్మెల్యే

Update: 2019-01-28 12:49 GMT
చాలామంది హిందుత్వాన్ని వాడుకుంటారు. కానీ కొద్దిమంది హిందుత్వాన్ని శ్వాసగా జీవిస్తారు. అలాంటి వారిలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఒకరు. ఎవ్వరు ఏమన్నా అనుకోనీ… తన మనసుకు నచ్చింది మాత్రమే చేస్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. ఒక ముస్లిం ప్రమాణ స్వీకారం చేయించడం తనకు ఇష్టం లేదని ధైర్యంగా ప్రకటించిన రాజా సింగ్‌ చివరి వరకు అదే మాటపై నిలబడ్డారు.

హిందుత్వాన్ని కాపాడేందుకు దేనికైనా రెడీ అనే రాజాసింగ్‌.. గోవధ చేస్తుంటే ఊరుకోరు. గోవు హిందువుల పవిత్రతకు చిహ్నం. అలాంటి గోవుని మాంసం కోసం చంపడం అన్యాయం అంటారు ఆయన. తాజాగా.. దాదాపు 100 గోవులను కబేళాకు తరలిస్తున్నారన్నా సమాచారం అందింది రాజాసింగ్‌ కు. అంతే వెంటనే సమాచారం అందుకుని.. ఆ లారీని వెంబడించారు. మేడ్చల్‌ వైపు లారీ వెళ్తుందని సమాచారం తెలుసుకున్న రాజా సింగ్‌ తన మందీ మార్బలంతో లారీని షామీర్‌ పేట దగ్గర లారీని అడ్డుకున్నారు. గోవుల్ని విడిపించి వాటిని గోశాలకు తరలించారు. ఆ తర్వాత.. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేశారు.

చాలామంది చెప్తారు. కానీ కొంతమంది మాత్రమే మాటమీద నిలబడతారు. అలాంటి వారిలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఒకరు. గోవులను రక్షించమని చాలామంది చెప్తారు కానీ కళ్లముందు కబేళాకు తరలివెళ్తున్నా ఎవ్వరూ పట్టించుకోరు. అసలు సిసలైన హిందూ ఎమ్మెల్యే అంటే రాజాసింగే.
Tags:    

Similar News