దేశంలో కరోనా సెకండ్ వేవ్ అలజడి సృష్టిస్తుంది. గత కొద్ది రోజులుగా భారత్లో రోజుకు 3.5 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీనితో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా, ఏ హాస్పిటల్ చూసినా కరోనా పేషెంట్లతో నిండిపోతున్నాయి. దీంతో వైద్య సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా కరోనా కట్టడిలో ముందున్న వారంతా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా బాధితుల కోసం విశ్రాంతి అన్నది లేకుండా పని చేస్తున్నారు. చాలా మంది హెల్త్ కేర్ వర్కర్లు 24 గంటలు హాస్పిటల్లోనే ఉండి సేవలందిస్తున్నారు. తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలోనే ఒత్తిడి పోగొట్టుకోవడానికి, పేషెంట్లలో మనో స్థైర్యాన్ని నింపేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాసేపు రిలాక్స్ అయ్యేందుకు డ్యాన్స్ స్టెప్పులేస్తున్నారు. తాజాగా హెల్త్ వర్కర్లు పంజాబీ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో వైద్య సేవలు అందించే సిబ్బందికి సెలవులు కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వారు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీనితో ఒత్తిడిని దూరం చేసేందుకు, పేషెంట్లలో ధైర్యాన్ని నిపేందుకు వైద్య సిబ్బంది డ్యాన్సులు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు కరోనా రోగుల్లో సానుకూల ఆలోచనలు నింపుతాయని వారు చెబుతున్నారు. తాజా వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారుతోంది. హెల్త్ వర్కర్లు చేసిన పనిని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.
గుర్మీత్ చద్దా అనే నెటిజన్ ఈ వీడియోను షేర్ చేశారు. వైద్యులకు, ఇతర వైద్య సిబ్బందికి హాట్సాఫ్, ఈ అందమైన పాటకు స్టెప్పులేస్తూ, వారితో పాటు మా అందరి పెదవులపై చిరునవ్వులు పూయించారు అని కామెంట్ జత చేశారు. ఈ క్రమంలో కరోనా భయాన్ని పోగొట్టేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతూనే, బాధితుల్లో ధైర్యం నింపేందుకు మీరు ప్రయత్నిస్తున్న తీరు మా మనసులు కరిగించిందంటూ పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం మాత్రం తెలియరాలేదు. కాగా 2019 లో విడుదలై ఈ పంజాబీ పాటను రచయిత, సింగర్ షారీ మాన్ ఆలపించారు.
Full View