ఇటీవల కాలంలో ఎప్పుడు లేని రీతిలో హైదరాబాద్ ను వానదేవుడు కమ్మేశాడు. గడిచిన రెండు రోజులుగా ఆకాశం మొత్తం ముసురుపట్టటం.. దట్టమైన మేఘాలతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. నగర వ్యాప్తంగా గురువారం మొత్తం ఏదో ఒక టైంలో ఏదో ఒక చోట వర్షం పడుతూనే ఉంది. ఉదయంతో పోలిస్తే.. మధ్యాహ్నం.. ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటల తర్వాత నుంచి విపరీతమైన వర్షం కురుస్తూనే ఉంది. దీంతో.. హైదరాబాద్ నగరం వర్షం గుప్పిట్లో చిక్కుకుపోయిన పరిస్థితి.
ఇప్పుడున్న పరిస్థితి రానున్న ఐదు రోజుల పాటు సాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. శని..ఆదివారాల్లో అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే కాదు.. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి వర్ష సూచన ఉందని వాతావరణ విభాగ అధికారులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి వరంగల్.. ఖమ్మం.. నల్గొండ.. కరీంనగర్ జిల్లాల్లో వర్షానికి సంబంధించి హైఅలెర్టు ప్రకటించారు.దీనికి తగ్గట్లే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 15 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు గుంతలుగా మారాయి. మరో ఐదు రోజుల పాటు వర్షం విడవకుండా కురిసే అవకాశం ఉండటంతో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని.. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలంటున్నారు. దీనికి తోడు..వర్షం కారణంగా పలుచోట్ల డ్రెయిన్లు పొంగుతున్నాయని.. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుతుందని చెబుతున్నారు. రానున్న రోజుల్లో కురిసే భారీ వర్షంతో నగర ప్రజలు మరిన్ని ఇబ్బందులుఖాయమని చెప్పక తప్పదు. సో.. హైదరాబాద్ వాసులు.. బీకేర్ ఫుల్.