`హెలికాప్ట‌ర్ షాట్‌`.. క్రికెట్‌లో సంచ‌ల‌నం రేపిన దీని క‌థేంటి? తెలుసా?

Update: 2021-07-07 17:30 GMT
క్రికెట్ ప్రియుల‌ను ఎంతో ఉత్సాహానికి గురి చేసే.. షాట్‌.. హెలికాప్ట‌ర్ షాటే!  సిక్సులు, ఫోర్లు స‌రే.. కానీ, హెలికాప్ట‌ర్ షాట్ స్పెషాలి టీనే వేరు. స్టేడియంలో ప్ర‌త్య‌క్షంగా కూర్చుని క్రికెట్‌ను వీక్షిస్తున్న‌వారైనా.. టీవీలకు అతుక్కుపోయి.. చూస్తున్న‌వారైనా.. హెలికా ప్ట‌ర్ షాట్ అంటే.. కేరింత‌లు కొడ‌తారు. అంత క్రేజ్ ఉన్న ఈ హెలికాప్ట‌ర్ షాట్ గురించి తెలిసిన వారు చాలా త‌క్కువ మంది ఉన్నా రు. బ్యాట్స్‌మెన్ షూస్‌ను లక్ష్యంగా చేసుకొని బౌలర్లు వేసే యార్కర్లకు చాలా సార్లు బ్యాట్స్‌మెన్ వద్ద సమాధానం ఉండదు. కానీ, అలాంటి యార్కర్‌లను కూడా హెలీకాప్టర్ షాటతో అమాంతంగా స్టాండ్స్‌లోకి పంప‌డం.. వెరీ ఇంట్ర‌స్టింగ్‌!

ధోనీ స్నేహితుడి ద్వారా..

ప్ర‌స్తుతం క్రికెట్ ప్ర‌పంచంలో హెలికాప్ట‌ర్  షాట్‌ను ధోనీ హెలికాప్ట‌ర్ షాట్‌గా పిలుస్తున్నా.. దీని మూలాలు మాత్రం వేరే క్రీడాకారుడి వి. ఆయ‌న పేరే సంతోష్ లాల్‌. సంతోష్‌ లాల్ క్రికెటరే. ధోనీ స్నేహితుడు కూడా. జార్ఘండ్, బిహార్ తరఫున 8 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించిన సంతోష్‌ లాల్... ధోనీతో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. ఏడేళ్ల పాటు రంజీలకు ఆడిన సంతోష్‌ 2013లో మరణించాడు. సంతోష్ లాల్ అనారోగ్యంతో చివరి దశలో ఉన్నప్పుడు అతనికి ధోనీ అన్నివిధాలుగా సహాయం అందించాడు. ఇదంతా కూడా ధోనీ బ‌యోపిక్‌లో చిత్రీక‌రించ‌డం గ‌మ‌నార్హం.

ఇలా ప్ర‌చారంలోకి..

2006లో గోవాలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డేలో ధోనీ.. తొలిసారి హెలికాప్ట‌ర్ షాట్‌ను ప్ర‌యోగించాడు. జేమ్స్ అండర్సన్ వేసిన ఫుల్ లెంత్ బాల్‌ను ధోనీ తనదైన స్టైల్‌లో స్టాండ్స్‌లోకి పంపాడు. అప్పుడైతే ఎవరూ దాన్ని హెలికాప్టర్ షాట్ అని పిలవలేదు. కానీ, ఒక కూల్ డ్రింక్ కంపెనీ తన ప్రకటనలో ధోనీతో ఈ షాట్‌ను హెలికాప్టర్ షాట్‌గా పిలిపించడంతో అప్పటి నుంచి దీన్ని అదే పేరుతో పిలిస్తున్నారు. దూసుకొస్తున్న యార్కర్‌ను క్రీజు దాటకుండా ఫ్లిక్ చేసి లెగ్ సైడ్‌ నుంచి అమాంతంగా స్టాండ్‌కు పంపే ఈ షాట్ అంటే క్రికెట్ ప్రియుల‌కు, అభిమానులు.. మైండ్ బ్లోయింగే!

ధోనీతో మొద‌లై.. ఇప్పుడు..

హెలికాప్ట‌ర్ షాట్‌ను సంతోష్ లాల్ సృష్టించినా.. ధోనీతో వెలుగులోకి వ‌చ్చింది. అయితే.. ఇప్పుడు.. ధోనీని ఫాలో అవుతూ.. ఎక్కువ మంది ఈ షాట్‌ను అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నారు. టీం ఇండియా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా ..ధోనీ స్టైల్‌లో హెలికాప్టర్ షాట్ ఆడేస్తున్నాడు. అఫ్గానిస్తాన్ క్రికెటర్ ముహ్మద్ షహజాద్ కూడా తన దైన స్టైల్‌లో ఈ షాట్‌ కొడుతున్నాడు. ఇక‌, ముందుముందు.. ఇంకెంత మంది దీనిని ట్రై చేస్తారో చూడాలి.
Tags:    

Similar News