ఇళయదళపతి విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ సీఎం అయ్యారు. అదేంటి రాజకీయాల్లోకి రాకముందే ఆయన సీఎం ఎలా అయ్యారని ఆశ్చర్యపోతున్నారా? అయన నిజజీవితంలో సీఎం కాలేదు.. ఓ సినిమాలో ఆయన సీఎంగా నటిస్తున్నారు.అయితే ఇటీవల ఆయన మక్కల్ ఇయక్కమ్ అనే రాజకీయ పార్టీని ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేశారు. ఈ విషయం తమిళనాట పెద్ద సంచలనంగా మారింది. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ అంతా భావించారు.
కానీ విజయ్ మాత్రం భిన్నంగా స్పందించారు. తన తండ్రి పెట్టబోయే రాజకీయాపార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. తన అభిమాన సంఘాలు తండ్రి పెట్టిన రాజకీయపార్టీ కోసం పనిచేయొద్దని కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తండ్రి కొడుకుల మధ్య తీవ్ర మనస్ఫర్థలు నెలకొన్నట్టు వార్తలు వచ్చాయి. విజయ్ను ఎలాగైనా రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆయన తండ్రి చంద్రశేఖర్ భావిస్తుండగా.. విజయ్ మాత్రం పొలిటికల్ ఎంట్రీకి ఇది కరెక్ట్ టైం కాదని భావిస్తున్నారట.
మరోవైపు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో ఎస్ఏ చంద్రశేఖర్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు. ‘ మానాడు’ పేరుతో తెరకెక్కుతున్న ఈచిత్రంలో శింబు హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ పుదుచ్చేరిలో జరుగుతున్నది. ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్, భారతిరాజా, ఎస్జే సూర్య, మనోజ్ తదితరులు నటిస్తున్నారు. సురేశ్ కామాక్షి నిర్మాత.