గుజరాత్ సముద్ర తీరంలో పాకిస్తాన్ బోట్లు ఖాళీగా ఉండడం.. కొందరు ఉగ్రవాదులు దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో దక్షిణ భారత్ లోని రాష్ట్రాలన్నింటిలో హై అలెర్ట్ ను ప్రకటించారు.
తాజాగా ఏపీ రాష్ట్రంలోని తీర ప్రాంతంలో పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతంలో హైఅలెర్ట్ విధించారు.
ఏపీలోని శ్రీకాకుళం - విశాఖ కోస్తా - నెల్లూరు వరకూ పోలీసులు అలెర్ట్ అయ్యారు. సముద్రంలో గస్తీ తిరుగుతున్నారు. ఇక చేపల వేటకు వెళ్లే తీర ప్రాంత మత్య్సకారులకు కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు. కొత్త వ్యక్తులు - బోట్లు సముద్రంలో కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
ఉగ్రవాదులు దక్షిణ భారతంలోకి ప్రవేశిస్తారన్న హెచ్చరికల నేపథ్యంలో అంతటా హైఅలెర్ట్ నెలకొంది. ఏపీ తీరంలోనూ గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.