రాజధాని ప్రాంతంగా అమరావతి నిర్మాణానికి వేల సంఖ్యలో రైతులు భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన ఆ రైతులకు అప్పటి ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లిస్తామని తెలిపింది. ఈ వార్షిక కౌలు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు సంబంధించిన వార్షిక కౌలు విషయంలో సీఆర్డీఏ కు ఆదేశాలు జారీ చేసింది.
రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు అందడం లేదు. దీంతో ఆ రైతులంతా కలిసి హైకోర్టును ఆశ్రయించారు. తమకు వార్షిక కౌలు చెల్లించేలా సీఆర్డీఏను ఆదేశించాలని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేసిన ధర్మాసనం కౌలుకు సంబంధించిన వివరాలు అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై జూన్ 23వ తేదీలోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు అందించింది.