ఉత్తమ్ పిటిషన్ కొట్టివేత.. ఎన్నికలకు తొలగిన అడ్డంకి

Update: 2020-01-07 14:31 GMT
తెలంగాణలో పురపాలక ఎన్నికలకు అడ్డంకులు తొలగాయి. ఎన్నికలు ఆపాలంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఆయన పిటిషన్ తో పాటు మిగతా కొన్ని పిటిషన్లను కూడా విచారించి అన్నిటినీ కొట్టివేసింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారమే మున్సిపల్‌ ఎన్నికలు జరుగనున్నాయని తెలుస్తోంది.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జనవరి 22న పోలింగ్‌ - 25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాత్రి 8 గంటలకు ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో ఆ సందర్భంగా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అనంతరం నోటిఫికేషన్ ప్రకటించే వీలుంది.

తొలుత ఈ రోజు సాయంత్రం వరకు విడుదల చేయరాదని చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ - జస్టిస్ అభిషేక్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించారు. దాంతో నోటిఫికేషన్ విడుదలకు ఆటంకం ఏర్పడింది. ఎస్‌ ఈసీ 10 కార్పోరేషన్లు - 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పిటిషన్లను ఇప్పుడు కొట్టివేయడంతో నోటిపికేషన్ విడుదలకు మార్గం సుగమమైంది. మంగళవారం రాత్రికే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి.



Tags:    

Similar News