జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

Update: 2021-09-02 14:30 GMT
అదేందో కానీ ఏపీ ప్రభుత్వానికి వరుస పెట్టి న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు వరుస పెట్టి తగులుతున్నాయి. తాజాగా అలాంటి షాకే మరొకటి తాజాగా ఎదురైంది. చంద్రబాబు హయాంలో అడ్వకేట్ జనరల్ గా వ్యవహరించిన దమ్మాలపాటి శ్రీనివాస్.. మరికొందరిపైనా ఏపీ ప్రభుత్వం ఇన్ సైడ్ ట్రేడింగ్.. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసుల్ని తాజాగా ఏపీ హైకోర్టు కొట్టేసింది.

ఆయనపై చేసిన ఆరోపణల్లో బలం లేదని తేల్చింది దమ్మాలపాటి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ ఆయనపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. అవినీతి చట్టం కింద ఆయనపై పెట్టిన కేసులపై విచారణ జరిపిన హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో.. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే.. ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారనటానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇన్ సైడ్ ట్రేడింగ్ ఎక్కడ జరగలేదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అంతేకాదు.. ఈ కేసును నెలరోజుల్లో విచారణ చేయాలని ఏపీ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో సుప్రీంలో వేసిన పిటిషన్ ను ఏపీ ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో గత నెల రోజులుగా ఈ కేసుకు సంబంధించిన వాదనలు జరిగాయి. అనంతరం తీర్పును రిజర్వు చేశారు. దమ్మాలపాటితో పాటు ఆయన బంధువులు.. కుటుంబీకులపై చేసిన ఆరోపణలు నిరాధారమని.. ఎక్కడా రుజువు కాలేదని పేర్కొంది. అంతేకాదు.. దమ్మాలపాటిపై అన్యాయంగా కేసు పెట్టి మానసిక వేదనకు గురి చేసినందుకు.. వారిపై చర్యలు తీసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. మరి.. దమ్మాలపాటి ఊరుకుంటారో.. లేదంటే కేసులు పెట్టుకోవచ్చని చెప్పింది. మరి.. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో దమ్మాలపాటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News