దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. అయితే మేధావులు, మానవ హక్కుల సంఘాలు, కొందరు కమ్యూనిస్టులు ఈ ఎన్ కౌంటర్ ను ఖండించారు. ఓ వైపు అనుకూలత.. మరో వైపు ప్రతికూలతల నడుమ ఈ కేసు హైకోర్టుకెక్కింది.
అయితే తాజాగా దిశ ఎన్ కౌంటర్ హైకోర్టులో గొడవకు దారితీసింది. ఈ ఎన్ కౌంటర్ పై మహిళా సంఘాలు హైకోర్టుకెక్కాయి. ఈరోజు హైకోర్టు ప్రాంగణంలో మహిళా సంఘాల తరుఫు లాయర్లు - మరో వర్గం లాయర్ల మధ్య గొడవ పతాక స్థాయిలో జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఫేక్ ఎన్ కౌంటర్ కాదంటూ మహిళా సంఘాల తరుఫు లాయర్లను మరో వర్గం లాయర్లు నిలదీశారు. అయితే ఇది ఫేక్ ఎన్ కౌంటర్ అంటూ మహిళా సంఘాల తరుఫున లాయర్లు బల్ల గుద్ది వాదించారు.
హైకోర్టు జడ్జీలు జోక్యం చేసుకొని సర్ధి చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇరు వర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో హైకోర్టు ప్రాంగణంలో అలజడి సద్దుమణిగింది.