వేద నిలయం జయలలిత మేన కోడలికే ..హైకోర్టు కీలక తీర్పు

Update: 2021-11-24 15:30 GMT
త‌మిళ‌నాడు హైకోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది. దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత నివాసం వేద నిల‌యాన్ని మెమోరియ‌ల్ గా మార్చ‌డానికి వీలులేద‌ని కోర్టు తెలిపింది. ఈ మేర‌కు అన్నాడీఎంకే  ఇచ్చిన జీవోను కోర్టు ర‌ద్దు చేసింది. మాజీ ముఖ్యమంత్రి ఇల్లు అయిన వేదనిలయాన్ని ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవ‌డానికి హ‌క్కులేద‌ని తెలిపింది కోర్టు. మూడు వారాల్లో  పోయెస్ గార్డెన్‌ లోని జయలలిత నివాసం వేద నిలయాన్ని, మేన‌కోడ‌లు దీప, మేనల్లుడు దీపక్ కు అప్ప‌జెప్పాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జయలిలిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఏమాత్రం హక్కులేదని తెలిపింది.

జయకు రూ.913 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. ఆమె ఆకస్మిక మరణంతో ఆస్తులకు వారసులు ఎవరన్న అంశం వివాదమైంది. ఈ క్రమంలో కోర్టు తీర్పు కీల‌కంగా మారింది. 2016లో అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి ఏడాదే ఆమె నివాసమైన పోయెస్‌ గార్డెన్‌ ను స్మారక మందిరంగా మార్చాలని పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమని జయలలిత వారసులమని కోర్టు గుర్తించిందని, అలాంటిది ఆమె నివాసాన్ని ఎలా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా ఈ విషయంపై చాలా రోజుల నుంచి కోర్టులో విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వేద నిలయం ఆమె మేనకోడలు దీపకే చెందుతుందని హైకోర్టు తీర్పు వెలువరించింది.
Tags:    

Similar News