దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా కరోనా మహమ్మారి కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా, కేసులు తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఆఖరి ఆస్త్రంగా చాలా రాష్ట్రాల లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. అలాగే కరోనా మహమ్మారి భారీన పడి మరణించే వారి సంఖ్య కూడా రోజుకు 50కి పైగా నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు తెలంగాణ లో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మే 8 వ తేదీతో కర్ఫ్యూ సమయం పూర్తవుతుంది. దీనిపై ఈరోజు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ సమయం పొడిగించాలని ఆదేశించింది. కరోనా కట్టడిలో ప్రభుత్వం పనితీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నైట్ కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారని మండిపడింది. వీకెండ్ లాక్ డౌన్ పై ఎందుకు నిర్ణయం తీసుకోవాలని, ఈనెల 8 కంటే ముందే నైట్ కర్ఫ్యూ పై నిర్ణయం ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీకెండ్ లాక్ డౌన్ పై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించింది.
దీనిపై తాజాగా సీఎం సోమేశ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన సోమేశ్ కుమార్... ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలిపారు. కొన్ని రాష్ట్రాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా లాక్ డౌన్ పెట్టుకున్నాయిని చెప్పారు. తెలంగాణలో లాక్ డౌన్ పెట్టేంతగా పరిస్థితులు దిగజారలేదని తెలిపారు. లాక్ డౌన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, పైగా ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని చెప్పారు సోమేశ్ కుమార్. లాక్ డౌన్ విధించడం కంటే కోవిడ్ రోగులకు చికిత్స అందించడంపై దృష్టి సారించాలని అన్నారు. టెస్ట్ ల ఫలితాల కోసం వేచిచూడకుండా కరోనా లక్షణాలు కనిపిస్తే ట్రీట్ మెంట్ తీసుకోవాలని సూచించారు. అలాగే హైకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తామని సోమేశ్ కుమార్ తెలిపారు. వీకెండ్ లాక్ డౌన్ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో సంపూర్ణ లాక్ డౌన్ కాకుండా.. వీకెండ్ లాక్ డౌన్ విధించేందుకు తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.