సజ్జన్నార్‌పై ప్రశ్నలు వర్షం.. మీరు ఆయనపైనే ఆధారపుతారా?

Update: 2021-10-12 13:57 GMT
హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో... ఆ కేసు విచారణ కూడా సంచలనంగా మారుతోంది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నట్లు ఆరోపణలున్న పోలీస్ అధికారులను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన హైపవర్ కమిషన్ విచారిస్తోంది. దిశ కేసు విచారణలో భాగంగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ రెండవ రోజు  హైపవర్  కమిషన్ ముందు హాజరయ్యారు. ఆయనపై హైపవర్ కమిషన్ సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. నిన్న (సోమవారం) విచారణలో అసలు దిశ హత్యాచార కేసు దర్యాప్తుతో తనకు సంబంధం లేదని  సజ్జనార్ తేల్చిచెప్పారు. ఆ కేసు విచారణను తాను పర్యవేక్షించలేదని చెప్పారు.  దిశ హత్యచార కేసు విచారణను డీసీపీ శంషాబాద్‌ పర్యవేక్షించారని సజ్జన్నార్ తెలిపారు. ఏపీ పోలీస్‌ మాడ్యుల్‌లోని 43 ప్రకారం ఆయుధాల రిజిస్టర్‌ ఎస్పీ/సీపీ ఆధీనంలో ఉండాలని, ఆ రిజిస్టర్‌ తన దగ్గర ఎందుకు లేదో వివరణ ఇవ్వాలని సజ్జనార్‌ను కమిషన్ ప్రశ్నించింది. అయితే  ఆ పనిని ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగం చూస్తుందని, తనకు ఎలాంటి సంబంధం లేదని సజ్జనార్ జవాబు ఇచ్చారు. ఆయుధాలు కొత్తగా వస్తే అధికారులు తీసుకుంటారని, వాటిని ప్రత్యేకంగా రిజిస్టర్‌లో నమోదు చేయరని సమాధానం ఇచ్చారు. ఈ రోజు  (మంగళవారం)  విచారణలో సజ్జన్నార్‌పై హైపవర్ కమిషన్ సభ్యులు  ప్రశ్నల వర్షం కురిపించారు. దిశ కమిషన్‌ ముందు సజ్జనార్‌ విచారణ నేటితో ముగిసింది.

సజ్జన్నార్‌పై హైపవర్ కమిషన్ ప్రశ్నల వర్షం

ప్రశ్న: ఎన్‌కౌంటర్ జరిగిన విషయం మీకు ఏ సమయానికి తెలిసింది?

జవాబు: గత ఏడాది డిసెంబర్ 6న ఉదయం 6.20 నిమిషాలకు ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు తెలిసింది.

ప్రశ్న: ఎన్‌కౌంటర్‌పై ఎఫ్ఐర్ నమోదు ఎంక్వైరీ చేశారా?

జవాబు: శంషాబాద్ డీసీపీకి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పారు.

ప్రశ్న: ఎన్‌కౌంటర్ స్పాట్‌కి రీచ్ అయ్యాక ఎవరెవరిని కలిశారు?

జవాబు: ఏసీపీ సురేందర్‌ను కలిశా, పోస్టుమార్టం గురించి డీఎంఈకి సమాచారం అందించానన్నారు.

ప్రశ్న: ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఇంచార్జ్ ఆఫీసర్ ఎవరు?

జవాబు: షాద్‌నగర్ సీఐ శ్రీధర్ ఇంచార్జీ.

ప్రశ్న: సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌కు వెళ్లేటప్పుడు పోలీసులతో ఆయుధాలు ఉన్నాయా? ఎంత మంది పోలీసులు వెపన్స్ క్యారీ చేశారు?

జవాబు: పోలీసుల నుంచి నిందితులు వెపన్స్ లాక్కున్నారని తెలిపారు.

ప్రశ్న: ఇంక్వేస్ట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు చేయమని ఎవరు చెప్పారు?

ప్రశ్న: వెపన్స్ రికవరీ కాకుండా, పోస్ట్‌మార్టం పూర్తి కాకుండా ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టారు?

జవాబు: శంషాబాద్ డీసీపీ పెట్టమంటే ప్రెస్‌మీట్ పెట్టామన్నారు.

జవాబు: మా లీగల్ అడ్వైజర్ బాలా బుచ్చయ్య అని చెప్పారు.

ప్రశ్న: వెపన్స్ ఎందుకు అన్‌లాక్ చేశారు?

జవాబు: వెపన్స్ అన్‌లాక్ చేయలేదన్నారు.

ప్రశ్న:: మిమ్మల్ని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా మీడియా అభివర్ణించింది. మీరు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అని ఒప్పుకుంటారా?

జవాబు: నేను అంగీకరించను.

ప్రశ్న: ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అంటే ఏమిటి?

జవాబు: నాకు తెలియదు.

ప్రశ్న: మీరు ప్రతీది డీసీపీ చెప్తేనే తెలిసింది అంటున్నారు. డీసీపీపై నే ఆధార పడతారా?

జవాబు: గ్రౌండ్ లెవెల్ లో ఆఫీసర్ లకు. పూర్తి సమాచారం ఉంటుంది. వారికి నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తాను.

ప్రశ్న: దిశ అత్యాచారం జరిగిన రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారు?

జవాబు: మిస్సింగ్ కంప్లైంట్ రాగానే బాధితురాలి కోసం వెతకడం లో కొంత సమయం డిలే అయ్యింది.

ప్రశ్న: ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

జవాబు: ఎఐఆర్‌ నమోదు చేయడంలో అలసత్వం వహించిన నలుగురు పోలీస్ సిబ్బంది పై సస్పెన్షన్ విధించాం.

ప్రశ్న: 2008 వరంగల్‌లో ఎన్‌కౌంటర్, 2016లో నక్సలైట్ల ఎన్‌కౌంటర్, 2019 దిశ కేసు ఎన్‌కౌంటర్లలో ఒకే రకమైన విధానం కనిపిస్తోంది?

జవాబు: వరంగల్ ఎన్‌కౌంటర్ సమయంలో నేను ఎస్పీగా ఉన్నా, 2016లో నేను లా అండ్ ఆర్డర్‌లో లేనని తెలిపారు.


దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో ఇప్పటికే సిట్ ఇంచార్జ్ మహేష్ భగవత్, హోం శాఖ సెక్రెటరీ, బాధిత కుటుంబాలు, ప్రత్యక్ష సాక్షులు, డాక్టర్స్, ఫోరెన్సిక్ నిపుణులు, రెవిన్యూ అధికారులను  కమిషన్ విచారించింది. ఈ కేసులో సజ్జనార్ స్టేట్మెంట్ కీలకం కానుంది. విచారణ అనంతరం సుప్రీంకోర్టుకు కమిషన్ నివేదిక సమర్పించనుంది.
Tags:    

Similar News