ప్రధాని నరేంద్ర మోడీ.. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. చేసిన కరెన్సీ స్ట్రైక్స్ సంచలన ప్రకటనను దేశంలో మొట్టమొదట స్వాగతిస్తున్నట్టు చెప్పిన ఏకైక సీఎం చంద్రబాబు. తాను ప్రధాని మోడీ ప్రకటనను స్వాగతిస్తున్నని, రూ.500 - 1000 నోట్ల రద్దుతో దేశానికి పట్టిన నకిలీ చీడ అంతమైపోతుందని బాబు వ్యాఖ్యానించారు. అంతకు మించి ఆనందం వ్యక్తం చేశారు. అయితే, బాబులో ఆ ఆనందం - ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడేలాలేవు! ఎందుకంటే మోడీ సునామీకి అమరావతిలో పెను భూకంపమే వచ్చింది!
ఏపీ రాజధాని అమరావతిని సాధ్యమైనంత త్వరగా నిర్మించి ప్రజల్లో మార్కులు కొట్టేయాలని, 2019 ఎన్నికలకు బాటలు పరుచుకుపోవాలని సీఎం చంద్రబాబు ఎంతగానో భావించారు. ఎన్నో కలలు కన్నారు. అయితే, ఇప్పుడు ఈ కలలకు బ్రేక్ పడుతోంది. తాజాగా మోడీ తీసుకున్న డెసిషన్ బాబు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. నిన్న మొన్నటి వరకు వివిధ కారణాలు - కేసులతో నత్తనడకన సాగిన అనేక పనుల విషయంలో ఇకపై వేగం పెంచాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో నిర్మాణ రంగం ఊపందుకోవడం ప్రారంభించింది.
అయితే, ఉన్నట్టుండి పెద్ద నోట్లు రద్దు చేస్తూ.. కేంద్రం తీసుకున్న నిర్ణయం అమరావతికి షాక్ ఇస్తోంది. ఇక్కడి నిర్మాణాలు నిలిచిపోనున్నాయి. ఏపీలోని మిగిలిన ప్రాంతాల్లో లక్షల రూపాయల లావాదేవీలు జరిగితే.. రాజధాని ప్రాంతంలో కోట్లలో జరుగుతాయి. దీంతో ఆ స్థాయిలో కొత్త నగదు రావాలంటే కొన్ని నెలలు పట్టే అవకాశం ఉన్నందున ఇక్కడి నిర్మాణ రంగం - రియల్ ఎస్టేట్ వ్యాపారం కొద్ది రోజుల పాటు స్తబ్దుగా ఉంటుందన్న చర్చ నడుస్తోంది.
ఇక్కడ భారీ స్థాయిలో మౌలిక సౌకర్యాలు - నిర్మాణ రంగానికి కొత్త నగదు తగినంత స్థాయిలో అందుబాటులో ఉండదు కాబట్టి కొన్ని నెలల పాటైనా అవి నిలిచిపోక తప్పదు. దీంతో అమరావతి నిర్మాణాలు అనుకున్న సమయం కంటే ఎక్కువ పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా మోడీ డెసిషన్ అమరావతి దూకుడుకు బ్రేక్ వేసినట్లయ్యింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/