పెళ్లిలో హిజ్రాల డ్యాన్సులు..షాకిచ్చిన పోలీసులు

Update: 2020-08-09 07:10 GMT
ఈ కరోనా కల్లోలం వేళ వేడుకలు, సమూహాలుగా చేసే కార్యక్రమాలపై నిషేధం ఉంది. పెళ్లిళ్లలకు 50 మందిలోపే బంధువులతో చిన్నగా కానిచ్చేస్తున్నారు. గతంలోలా ఘనంగా వివాహాలు చేసుకోవడం.. రోడ్లపై ఊరేగింపులు, భరాత్ లు చేయడాన్ని అధికారులు నిషేధించారు.

అయితే తాజాగా ఈ నిబంధనలు అతిక్రమిస్తూ ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఓ పెళ్లిని నిర్వహించారు. నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. గిద్దలూరు నగర పంచాయితీ పాములపల్లెకి చెందిన ఓ కుటుంబంలోని యువకుడికి రెండు రోజుల క్రితం వివాహమైంది. పోలీసుల అనుమతి తీసుకోకుండా ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాత్రి వేళ హిజ్రాలతో అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయించారు.

సమాచారం అందుకున్న గిద్దలూరు పోలీసులు గ్రామానికి వచ్చి వివాహ నిర్వాహకులు, నృత్యాలు చేసిన హిజ్రాలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కరోనా టైంలో అనుమతి తీసుకోకుండా వివాహం చేసుకోవడం.. ఊరేగింపులు డ్యాన్సులు చేయడం నేరమని వారిని కటకటాల పాలు చేశారు.

    

Tags:    

Similar News