వైరల్ వీడియోః సినిమాను తలపించిన విధ్వంసం.. విరిగిపడిన కొండ.. 9మంది బలి!
అచ్చం హాలీవుడ్ సినిమా తరహాలో ఘోరం జరిగింది. ఉన్నట్టుండి కొండ చరియలు భారీస్థాయిలో విరిగిపడ్డాయి. భారీ గుట్ట కింద ఉన్న నివాసాలపై పెద్ద పెద్ద బండరాళ్లు పడిపోయాయి. ఇళ్ల ముందు పార్కు చేసిన కార్లు, ఇతర వాహనాలతోపాటు ఇళ్లు కూడా ధ్వంసమైపోయాయి. ఒళ్లు గగుర్పొడిచే ఈ విధ్వంసంలో 9 మంది బలైపోయారు. ఈ దారుణ సంఘటన హిమాచల్ ప్రదేశ్ లో ఇవాళ మధ్యాహ్నం (జూలై 25) చోటు చేసుకుంది.
కిన్నౌర్ జిల్లా సంగాల్ లోయలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన హిమాచల్ ప్రదేశ్ కు జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కరోనా నిబంధనలు సడలించడంతో పర్యాటకుల తాకిడి మరింతగా పెరిగిపోయింది. ఇవాళ ఆదివారం కావడంతో.. ఆ ప్రాంతమంతా టూరిస్టులతో నిండిపోయింది.
అయితే.. ఉన్నట్టుండి ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చింది. గత వారం రోజులుగా కురిసిన వర్షాలతో కొండ చరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఈ విషయాన్ని గుర్తించిన పర్యాటకులు చెల్లాచెదురై పరుగులు పెట్టారు. కొందరు టూరిస్టులు అద్దెకు తీసుకున్న గదుల్లోకి పరిగెత్తగా.. మరికొందరు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.
కానీ.. ఎటూ వెళ్లలేకపోయినవారు, ఆలస్యంగా ఈ ప్రమాదాన్ని గుర్తించిన వారు మాత్రం కొండ చరియల కింద నలిగి ప్రాణాలు కోల్పోయారు. చాలా ఇళ్లు ధ్వంసమైపోయాయి. ఈ దారుణ ఘటనలో 9 మంది చనిపోయారు. వారిలో టూరిస్టులు ఎంత మంది? స్థానికులు ఎందరు? అన్నది తేలాల్సి ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ వేగంగా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.