అన్యమత ప్రచారాన్ని అడ్డుకోలేరు కానీ..

Update: 2015-03-17 04:43 GMT
మిగిలిన ప్రాంతాల సంగతేమో కానీ.. హిందూ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరుపతిలో అన్యమత ప్రచారం ఏ రేంజ్‌లో సాగుతుందో తెలిసిందే. వాస్తవానికి తిరుపతిలో అన్యమత ప్రచారంపై నిషేధం వ్యక్తమవుతోంది.

అయినప్పటికీ తరచూ అన్యమత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హిందూ ధర్మ పరిరక్షణ సమితి టీటీడీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించింది. అన్యమతాన్ని అడ్డుకోలేని పోలీసులు.. ఆ ఘటనలపై నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులపై తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు.

టీటీడీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళుతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు.. కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు తమదైనశైలిలో చర్యలు తీసుకొని ఆందోళనను అణిచివేశారు. ఇదేదో అన్యమత ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు చేస్తే.. అసలు గొడవలే ఉండవు కదా. జబ్బు ఒకచోట ఉంటే.. దానికి మందువేయకుండా.. జబ్బుకు భయపడుతున్న వారిపై ప్రతాపం చూపిస్తే ప్రయోజనం ఏముంటుంది?

Tags:    

Similar News