హిందూ వివాహ బంధం దృఢమైనదని పెద్దలు చెబుతుంటారు. తాజాగా గణాంకాలూ అది నిజమని రుజువు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన జనాభా లెక్కల సేకరణలో దేశంలోని వివిధ మతాల్లో భార్యాభర్తల విడాకులు - విడిపోవడానికి సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అన్ని మతాలకన్నా కూడా హిందువుల్లోనే విడాకుల రేటు చాలా తక్కువగా ఉందని ఈ సందర్భంగా తేలింది.
హిందువుల్లో ప్రతి వెయ్యి మందికి 1.8 మంది మాత్రమే విడాకులు తీసుకున్నారట. హిందువులతో పోలిస్తే ముస్లింలలో విడాకులు తీసుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ముస్లింలలో ప్రతి వెయ్యి మందికి 3.4మంది విడాకులు తీసుకుంటున్నారు. భర్త భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులు తీసేసుకునే విధానం ఉండడమే ముస్లింలలో విడాకులు ఎక్కువ కావడానికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ముస్లింలలో విడాకులు తీసుకున్న ప్రతి వెయ్యిమందిలో అయిదుగురు మహిళలు విడాకులు కోరగా.. హిందువులు - సిక్కులు - జైన్ లలో అది ప్రతి వెయ్యి మందికి 2 నుంచి 3గా ఉంది.
మన దేశంలో భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం - వేరుపడ్డం క్రైస్తవులు - బౌద్ధుల్లో ఎక్కువగా ఉండగా జైన్ లు - సిక్కుల్లో చాలా తక్కువగా ఉందని కూడా ఈ గణాంకాలు చెబుతున్నాయి. 2011 జనాభా లెక్కలను పరిశీలిస్తే ఈ విషయాలు బోధపడతాయి. అయితే.. ఇతర దేశాలతో పోల్చితే మాత్రం మతాలకు అతీతంగా భారత దేశ వివాహ బంధాలు చాలా గట్టివి.