ఆ చిట్కాలు పాటించి 5 రోజుల్లోనే కోలుకున్నా : మహమూద్‌ అలీ

Update: 2020-07-04 01:30 GMT
తెలంగాణ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ రోజు రోజు కి భారీగా పెరిగి పోతుంది. ఇప్పటికే తెలంగాణ లో మహమ్మారి పాజిటివ్ కేసులు 20 వేలు దాటాయి. దీనితో పాటు గా తాజా గా మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా టి ఆర్ ఎస్ నేతలు , మంత్రులు ఈ కరోనా భారిన పడుతున్నారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ గారు కూడా కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ అని తెలియ గానే అయన వెంటనే హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.

 హోం మంత్రి మహమూద్‌ అలీ చికిత్స అనంతరం శుక్రవారం కరోనా నుండి కోలుకొని  ఆస్పత్రి నుంచి డిశ్చార్జి  అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ..  గత నెల 25వ తేదీన నా గన్‌మన్‌ కు జ్వరం వచ్చింది. తర్వాత అటెండర్‌ కు.. ఇలా పేషీలో 11 మందికి జ్వరం రావడం తో 28వ తేదీన ఆస్పత్రి లో చేరా. పాజిటివ్‌ అని తేలింది. వైద్యులు ఇచ్చే యాంటీ బయాటిక్‌ మందులు తీసుకున్నా. తులసి ఆకులు వేసిన వేడి నీళ్లను రోజుకు నాలుగైదు సార్లు తాగా అని , రోజూ రెండు సార్లు ఆవిరి పట్టా. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి పూట ఉడక బెట్టిన గుడ్డు.. నల్ల మిరియాలు వేసుకుని తిన్నా. వేడి నీళ్లు... వేడిగా ఉండే ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇచ్చా. అల్లం, వెల్లుల్లి ని ఎక్కువగా తీసుకున్నా. గొంతు లో ఇన్‌ఫెక్షన్‌ తగ్గడానికి ఉప్పు వేసిన నీటిని పుక్కిలించా. రాత్రి పూట పసుపు వేసిన పాలు తాగా. రోజూ ఉదయం 10 నిమిషాలు యోగా తో పాటు ఊపిరి తిత్తులకు మేలు చేసే వ్యాయామాలు చేశా. ఐదు రోజుల్లోనే సాధారణ స్థితి కి వచ్చి... ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యా అని వివరించారు.
Tags:    

Similar News