కరోనా కల్లోలం తర్వాత దేశంలో ధరాఘాతం మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దేశమంతా ధరలు కొండెక్యాయి. సామాన్యులకు అందనంత పెరిగిపోయాయి. జీవన వ్యయాలు, నివాసానికి అయ్యే వ్యయాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన ఓ రేటింగ్ సంస్థ 'మెర్సర్స్ 2022 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే’ నిర్వహించింది. ఇందులో అంతర్జాతీయంగా చూస్తే మాత్రం ముంబై, ఢిల్లీ వ్యయాల పరంగా ఆకర్షణీయంగా ఉన్నట్టు సర్వేలో తేలింది.
దేశంలోనే ముంబై అధిక ఖర్చుతో కూడిన నగరంగా దేశంలో తేలింది. ఇక హైదరాబాద్ ను చౌకగా ప్రవాస భారతీయులు భావిస్తున్నారు. ముంబైకి టాప్ రేటింగ్ ఇచ్చారు. అంతర్జాతీయంగా చూస్తే ముంబై ర్యాంకు 127, ఢిల్లీ 155, చెన్నై 177, బెంగళూరు 178, హైదరాబాద్ 192వ స్థానంలో ఉన్నాయి.
ఆ తర్వాత పుణే 201, కోల్ కతా 203 ర్యాంకుల్లో ఉన్నాయి. ఈ పట్టణాల్లో నివాస, జీవన వ్యయాలు చౌకగా ఉన్నాయని ప్రవాసులు భావిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయంగా చూస్తే హంగ్ కాంగ్ అత్యంత ఖర్చుతో కూడుకున్న నగరంగా నిలిచింది. ఆ తర్వాత జ్యూరిచ్, జెనీవా, స్విట్జర్లాండ్ లోని బాసెల్, బెర్న్, ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్, అమెరికాలోని న్యూయార్క్, సింగపూర్, టోక్యో, బీజింగ్ నగరాలు అధిక వ్యయాలతో అగ్రస్థానాల్లో ఉన్నాయి.
ఈ ఏడాది మార్చిలో మెర్సర్స్ ఈ సర్వే నిర్వహించింది. 200కు పైగా కమోడిటీల ధరలు, ఇళ్లు, రవాణా, ఆహారం, వస్త్రాలు, ఇంట్లోని వస్తువులు, వినోదానికి చేసే ఖర్చు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 227 పట్టణాలను ర్యాంకుల్లోకి తీసుకుంది.
హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ పడిపోయింది. కరోనా భయంతో అందరూ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. దీంతో ఎక్కడ చూసినా టు-లెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఇన్నాళ్లు నగరాలకు విద్యా, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారాల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో అద్దెఇళ్లకు ధరలు భారీగా ఉండేవి. ఇప్పుడు అందరూ వెళ్లిపోవడంతో ఇళ్లు అద్దెకు తీసుకునే వారు లేక ఈగలు తోలుకునే పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాద్ లాంటి చోట సొంత ఇల్లు ఉంటే ఆ అద్దెలతోనే బతికేయవచ్చు. అంత డిమాండ్ ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. కరోనా ధాటికి ఇప్పుడు అద్దె ఇళ్లు మొత్తం ఖాళీ అయిపోయారు. అందరూ స్వస్థలాలకు వెళ్లిపోవడంతో అద్దె ఇళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా టు లెట్ బోర్డులే. సగం ధరకే ఇళ్లు ఇస్తామన్నా ఎవరూ రాని పరిస్థితి.
మూడు నాలుగు నెలలుగా అద్దె ఇళ్లు ఖాళీగా ఉండడం తో నిర్వహణ, పన్నులు, కరెంట్ బిల్లుల భారం యజమానులపై పడి బావురు మంటున్నారు. సామాన్యులకే కాదు.. వ్యాపార సముదాయాల వరకు ఉపాధి కోల్పోయి ఇళ్లు, కార్యాలయాలు అన్నీ ఖాళీ చేయడంతో యజమానులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు, శిక్షణ సంస్థలు ప్రారంభం కాకపోవడంతో అద్దె ఇళ్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. దీంతో భవనాల నిర్వహణ,వాటిపై తీసుకున్న ఈఎంఐల చెల్లింపులు యజమానులకు భారంగా మారాయి. కరోనా దెబ్బకు లాభమనుకున్న ఈ వ్యాపారం పుట్టెడు నష్టాల పాలైంది. దేశంలోనే అన్ని ప్రాంతాల్లోకి హైదరాబాద్ లో ఇళ్ల ధరల పరంగా చౌకగా ఉన్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. జీవన వ్యయాలు, నివాస వ్యయాలు కలిపి చూస్తే పుణే, కోల్ కతా కంటే హైదరాబాద్ వెనుక ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగలూరులో ఇళ్ల అద్దెలు దేశంలోనే అత్యంత ఎక్కువగా ఉన్నాయి. అక్కడ జీవన వ్యయాలు బాగా ఎక్కువ.
ఇక ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముంబైని అత్యంత అనుకూల నగరంగా భావిస్తున్నాయి. అదే సమయంలో తక్కువ వ్యయాలు ఉండే హైదరాబాద్, చెన్నై, పుణే పట్ల కూడా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ముంబైలో అధిక వ్యయాలు ఉండడంతో హైదరాబాద్, చెన్నై,పుణె నగరాలు తక్కువ వ్యయాలతో ఆకర్షణీయమైన మెట్రోలుగా సర్వే పేర్కొంది.