ఒక్కసారి కరోనా వచ్చాక మనిషి శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయన్న విషయం తెలిసిందే. అయితే ఒక్కసారి కరోనా వస్తే.. కేవలం ఆరునెలలు మాత్రమే శరీరంలో యాంటీబాడీలు ఉంటాయని.. ఆ తర్వాత మళ్లీ కరోనా సోకే అవకాశం ఉందని వైద్యులు ఇప్పటివరకు చెప్పేవారు. దీంతో కరోనా ఓ సారి సోకినా.. మళ్లీ వచ్చే అవకాశం ఉందని తేలింది. ఇదిలా ఉంటే కరోనాకు సంబంధించిన యాంటీబాడీలు శరీరంలో పదేళ్లపాటు ఉండొచ్చని ఓ అధ్యయనం తేల్చిచెప్పింది. అంటే ఒక్కసారి కరోనా సోకితే మళ్లీ పదేళ్ల వరకు ఆ వ్యక్తికి పదేళ్ల పాటు కరోనా రాదు.
అయితే ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనాపై రోజుకో పరిశోధన వెలుగు చూస్తున్నది. గతంలో కరోనా యంటీబాడీలు ఆరునెలలు మాత్రమే ఉంటాయని పరిశోధకలు తేల్చారు. తాజాగా మరో కొత్త విషయం వెలుగుచూసింది.ఈ మేరకు లన్సెట్ మైక్రోబ్ అనే సంస్థ ఓ పరిశోధన నిర్వహించింది.అయితే యాంటీబాడీలు ఎంతకాలం శరీరంలో ఉంటాయి? అనే విషయం సదరు వ్యక్తి రోగనిరోధక శక్తి, శరీర పనితీరుమీద ఆధారపడి ఉంటుందని లాన్సెట్ మైక్రోబ్ నివేదిక తెలిపింది.కరోనా నుంచి కోలుకున్నాక న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ తక్కువస్థాయిలో ఉత్పత్తయినా టీ సెల్స్, రోగనిరోధక వ్యవస్థ చురుగ్గా పనిచేస్తే వారికి మళ్లీ కరోనా సోకదని పేర్కొన్నది.
మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తున్నది. గత 24 గంటల్లో 50 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా కేసుల సంఖ్య తగ్గడం లేదు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవేళ కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే ఎన్నికలు నిర్వహిస్తారా? లేక వాయిదా వేస్తారా? అన్న విషయం వేచిచూడాలి.అయితే తెలంగాణలోనూ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నది.