ఇదెక్కడి పోయే కాలం? తాడుతో బంధించి ఆవుపై అత్యాచారం?

Update: 2022-04-01 04:54 GMT
కొన్ని ఉదంతాల్ని విన్నంతనే ఒళ్లు గగుర్పాటుకు గురి కావటమే కాదు.. అసలు ఇలా జరుగుతుందా? అన్న సందేహం కలుగుతుంది. ఇలాంటి విషయాల్ని నోటితో చెప్పేందుకు సైతం సిగ్గుపడేలా ఉంటాయి. మనిషికి మించిన ప్రమాదకరమైన మృగం మరేదీ ఉండదన్న మాటను నిజం చేసేలా ఈ కామ పిశాచి తీరు ఉంది. జరిగిన దారుణం గురించి తెలిసినంతనే ఒళ్లంతా వికారంగా మారి.. ఇలాంటి కామ పిశాచిని ఎంత దారుణంగా శిక్షించినా తప్పేం లేదన్న భావన కలుగక మానదు. నిర్మల్ జిల్లాని పిప్రి గ్రామంలో జరిగిన ఈ ఉదంతంలోకి వెళితే..
 
పిప్రి గ్రామానికి చెందిన సాయన్న కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. ఇంట్లో మార్బుల్ వేసుకునేందుకు యూపీకి చెందిన కూలీల్ని పిలిపించారు. పని చివరకు వచ్చింది. గృహప్రవేశం కోసం ఆవును తీసుకొచ్చారు. కొత్త ఇంట్లో ఆవును తిప్పితే మంచిదన్న సంప్రదాయంలో భాగంగా ఆవును తీసుకొచ్చి ఇంటి బయట కట్టేశారు.

బుధవారం అందరూ నిద్రపోయిన తర్వాత మార్బుల్ కూలీల్లోని విజయ్ అనే నిందితుడు.. అర్థరాత్రి దాటిన తర్వాత ఆవును ఇంట్లోకి తీసుకొచ్చి.. కిటికీ ఊచలకు దాన్ని కట్టేశాడు.

అనంతరం దానిపై అత్యాచార ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బెదిరిపోయిన ఆవు.. పెనుగులాటలో మార్బుల్ బండలపై జారి పడిపోయింది. ఆవు మెడకు కట్టిన తాడు.. ఊరిగా మారిపోవటంతో ఊపిరి ఆడని కారణంగా చనిపోయింది. ఉదయాన్నే బయట ఉండాల్సిన ఆవు ఇంటి లోపల ఉండటం.. అది కూడా మెడకు ఉరి వేసినట్లుగా ఉండటంతో అనుమానం కలిగింది. దీనికి తోడు నిందితుడి విజయ్ తీరు అనుమానాస్పదంగా మారింది.

దీంతో సాయన్నకు సందేహం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని అనుమానితులందరిని విచారించారు. ఈ నేపథ్యంలో చేసిన దారుణం గురించి బయటకు చెప్పి ఒప్పుకున్నాడు విజయ్.

అతడ్ని అరెస్టు చేశారు. ఆవును శవపరీక్ష కోసం పశువైద్యాధికారి వద్దకు పంపారు. ఇలాంటి కామపిశాచిని ఏం చేయాలి? ఎంతలా శిక్షించాలి. నోరు లేని మూగజీవాల్ని సైతం వదలకుండా.. వాటిని బంధించి చేసే ఈ వికారపు చేష్టలకు వేసే శిక్షలు.. అంతే కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News