ముస్లింల సమాధులపై రామ మందిరం నిర్మిస్తారా?

Update: 2020-02-19 06:50 GMT
గతఏడాది అయోధ్య బాబ్రీమసీదు భూవివాదంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. భూవివాదం ఉన్న స్థలాన్ని రామ్‌లల్లాకు కేటాయస్తూ మసీదు నిర్మాణానికి అయోధ్యలో ఐదెకరాల స్థలం కేటాయించాలంటూ తీర్పులో వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే, రాముడి ఆలయం నిర్మాణం కోసం ట్రస్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే , తాజాగా సుప్రీం సీనియర్ లాయర్ సమాధి పై రామాలయం నిర్మాణపు పునాదులు వేస్తారా .. అలా వేయొచ్చా ..? అని అయోధ్య రామాలయం ట్రస్టీలను ప్రశ్నించారు.

కూల్చివేసిన బాబ్రీ మసీదు కింద సమాధి ఉందని.. కేవలం పట్టుదలకు పోయి సనాతన ధర్మాన్ని మరిచిపోతారాల అంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది షమ్షద్ ట్రస్టు సభ్యులను ప్రశ్నించారు. సనాతాన ధర్మం ప్రకారం ఒక సమాధిపై రాముడికి ఆలయం నిర్మించవచ్చా అనేది మరోసారి సమీక్షించాలని ఆయన కోరారు. ముస్లింల సమాధి పై రాముడి ఆలయం నిర్మించవచ్చా అని ప్రశ్నించారు. దీనిపై ట్రస్టు నిర్వాకులు ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ముస్లింల నమ్మకం ప్రకారం గంజ్ షాహిదాన్ అనే స్మశానం బాబ్రీ మసీదు కూల్చివేసిన ప్రాంతం లో ఉందని చెప్పారు. 1885 లో జరిగిన అల్లర్ల లో 75 మంది ముస్లింలు మరణించారని వారందరిని అక్కడే సమాధి చేశారని గుర్తు చేశారు షమ్షద్

ముస్లింల స్మశాన వాటిక అక్కడ ఉందన్న విషయాన్ని కేంద్రం మరిచిందని లాయర్ షమ్షద్ చెప్పారు. ఇక ధర్మాన్ని పక్కనబెట్టి ఆ ప్రాంతంలో రామాలయం నిర్మాణంకు ప్లాన్ చేస్తోందని చెప్పారు. కూల్చి వేయబడ్డ బాబ్రీ మసీదు కింద సమాధులు ఉన్నాయని ధర్మాన్ని దృష్టి లో ఉంచుకుని, శ్రీరాముడి పై ఉన్న గౌరవంతో అక్కడ ఆలయ నిర్మాణం చేపట్టరాదని షమ్షద్ ట్రస్టు సభ్యులను కోరారు. ఇదిలా ఉంటే రాముడి ఆలయం నిర్మాణం చేపడుతున్న ఆ 67 ఎకరాల్లో స్మశాన వాటిక లేదని అయోధ్య జిల్లా పాలనావర్గం చెబుతోంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు లాయరుకు లేఖ ద్వారా అయోధ్య పాలనావర్గం తెలిపింది.

ఇప్పుడు మీరందరూ ధర్మకర్తలు.. సమకాలీన భారతదేశం లో గొప్ప వ్యక్తులు..హిందూ సనాతన్ అభ్యాస రంగంలో ఉత్తమ జ్ఞానం..అనుభవం కలిగివారు మీరు. సనాతన ధర్మం యొక్క మత గ్రంథాల దృష్ట్యా మీరు రామ్ జనమ్స్థాన్ ఆలయాన్ని ముస్లింల సమాధులపై నిర్మించగలరా? దీనికి మీ ధర్మం అంగీకరిస్తుందా? ఇటువంటి కీలక అంశాలపై ట్రస్ట్ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉందని లేఖలో తెలిపారు. అయితే , అయోధ్య రామమందిరం బాబ్రీ మసీదు కేసు విచారణ సందర్భం గా అన్ని అంశాలను సుప్రీం కోర్టుకు తెలియజేశామని, ధర్మాసనం కేసును విచారణ చేస్తున్న సమయంలో ఈ అంశం కూడా వచ్చిందని దీనిపై కూడా వివరణ ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనూజ్ తెలిపారు.
Tags:    

Similar News