క‌త్తి మ‌హేష్ కు భారీ ప్ర‌మాదం

Update: 2021-06-26 06:49 GMT
సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్ భారీ ప్ర‌మాదాన్ని ఎదుర్కొన్నారు. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారును లారీ ఢీకొన‌డంతో.. వాహ‌నం తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ది. అయితే.. ఆయ‌న స్వ‌ల్ప గాయాల‌తోనే బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ విధంగా పెను ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు.

నెల్లూరు జిల్లా కొడ‌వ‌లూరు మండ‌లం చంద్ర‌శేఖ‌ర పురం నేష‌నల్ హైవేపై ఇన్నోవా కారులో మ‌హేష్ ప్ర‌యాణిస్తున్నారు. ఈ క్ర‌మంలో లారీ.. కారు బ‌లంగా ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది. అయితే.. స‌మ‌యానికి ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావ‌డంతో ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు.

అయితే.. మ‌హేష్ ప్ర‌యాణిస్తున్న కారే అదుపు త‌ప్పి, ముందు వెళ్తున్న లారీ కంటెయిన‌ర్ ను ఢీకొట్టిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప్ర‌మాదం కూడా శుక్ర‌వారం అర్ధ‌రాత్రి సమ‌యంలో జ‌రిగిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఆయ‌న నెల్లూరులోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

క‌త్తిమ‌హేష్ స్వ‌స్థలం చిత్తూరు జిల్లా. స్వ‌గ్రామం నుంచి హైద‌రాబాద్ వెళ్తుండ‌గా.. ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు స‌మాచారం. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News