రెండు తెలుగు రాష్ట్రాల్లో టమోటా పంటను భారీగా పండించే జిల్లా అన్నంతనే అందరికి గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లా. ఇక్కడి మదనపల్లెలో భారీ ఎత్తున టమోటాల్ని పండిస్తారు. తాము పండించిన పంటకు సరైన ధర రాని వేళలో.. అమ్మలేక రోడ్ల మీద పడేసి వెళ్లిపోయిన ఉదంతాల్ని ఇప్పటివరకు చాలానే చూసి ఉన్నాం.
ఇప్పుడు అందుకు భిన్నంగా.. టమోటా ధర ఎంత భారీగా పెరిగిందో తెలిస్తే షాక్ తినాల్సిందే. టమోటా మార్కెట్ చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీగా రైతుల నుంచి టమోటాల్ని కొనుగోలు చేశారు వ్యాపారులు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మదనపల్లి మార్కెట్లో మొదటిరకం టమోటాలను కేజీ రూ.104 చొప్పున హోల్ సేల్ వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇంతకాలం ఇదే ధరకు బాక్సు టమోటాలు వచ్చే పరిస్థితి. అందుకు భిన్నంగా.. ఇంత భారీగా ధర పలకటంతో సామాన్యుడు సంగతి తర్వాత.. మధ్యతరగతి జీవి సైతం టమోటాను కొనలేని పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.
దీనికి తోడు మదనపల్లి డివిజన్ లో పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాల కారణంగా టమోటా దిగుబడులు తగ్గిపోయాయి. కాయలు కోసేందుకు పొలాల్లో నీళ్లు నిలిచి ఉండటంతో.. వాటిని సరైన సమయంలో కోయలేకపోవటం.. నాణ్యత కోల్పోవటం.. డ్యామేజీ అధికంగా ఉంటున్న పరిస్థితి.
దీంతో టమోటా ధర భారీగా పెరిగిపోయింది. మొదటి రకం టమోటా రూ.60 నుంచి రూ.104పలకగా.. రెండో రకం టమోటా రూ.18 నుంచి రూ.58 చొప్పున హోల్ సేల్ వ్యాపారులు కొనుగోలు చేశారు.
ఈ నేపథ్యంలో మొదటి ధర టమోటా కేజీ రూ.200పైనే అమ్మటం ఖాయమని చెబుతున్నారు. ఇక.. రెండో రకం టమోటా కేజీ రూ.150 చొప్పున అమ్ముతారని.. డ్యామేజ్ తో పాటు రవాణా ఛార్జీలు భారీగా పెరిగిపోవటంతో.. ధర పెరుగుతుందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతకాలంపాటు టమోటాల్ని మధ్యతరగతి జీవి కూడా కొనలేడేమో?