ఆంద్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరు మరింత పెరుగుతోంది. ముఖ్యంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ మోహన రెడ్డి చేస్తున్న ప్రస్తుత ఉత్తరాంధ్ర పర్యాటన మంచి ఫలితాలు ఇస్తున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం విజయనగరంలో పర్యాటిస్తున్న జగన్ ప్రజాసంకల్ప యాత్రకు అఖండ మద్దతు లభిస్తోంది. పార్వతిపురం - కురుపాం వంటి చిన్న మండల కేంద్రలలో కూడా జగన్ ను చూసేందుకు - ఆయన ప్రసంగాలు వినేందుకు లక్షల సంఖ్యలలో ప్రజలు వస్తున్నారు. కురుపాంలో జరిగిన పాదయాత్రకు విజయనగరం జిల్లా ఏజేన్సీ ప్రాంతాల నుంచి లక్షల మంది గిరిజనులు రావడం ఆ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనంగా చెబుతున్నారు. పాదయాత్రకు ప్రజలు రావడం ఒకెత్తు అయితే చంద్రబాబు నాయుడిని జగన్ విమర్శిస్తున్న సమయంలో ప్రజల నుంచి వస్తున్న ప్రతిస్పందన మరొక ఎత్తని అంటున్నారు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో - ఏం చేయగలనో - ఏమి చేయలేనో జగన్ మోహన రెడ్డి స్పష్టంగా చెబుతుండడంతో ప్రజల నుండి ఆదరణ పెరుగుతోంది. ఇంతకు ముందు విశాఖ జిల్లాలో పర్యాటించిన సమయంలో కూడా జగన్ కు ఇంత స్పందన వచ్చింది.
ఇక రెండు నెలల క్రితం శ్రీకాకుళం జిల్లాలో పర్యాటించిన సమయంలో జిల్లా మొత్తం జగన్ వెనుక నడిచింది. ఆ సమయంలోనే జిల్లాలో జగన్ ప్రభావం ఎంతుందో రాజకీయ విశ్లేషకులకు ఓ అంచనా వచ్చింది. తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం జిల్లాలో ఆదరణ తగ్గిపోయిందని - రాజకీయ విశ్లేషకులు ఓ అంచానాకు వచ్చారు. జగన్ పర్యాటన తర్వాత జిల్లాను కుదేపేసిన తితిలి తుఫాను ప్రభావం కూడా తెలుగుదేశం పార్టీపై తీవ్రంగా పడింది. తుఫాను ప్రభావంతో జిల్లా ప్రజలు అతలాకుతలం అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన సహాయ సహకారాలు అంతంత మాత్రమేనని ఓ అభిప్రాయం ఏర్పడింది. ప్రతిపక్షా పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు - నాయకులు - కార్యకర్తలు తుఫాను బాధితులకు చేసిన సేవ సిక్కోలు వాసులను మరింత జగన్ అభిమానులుగా మార్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం - విజయనగరం - శ్రీకాకుళం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పరమైనట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచన వేస్తున్నారు.