అన్నంలో తల వెంట్రుక.. భార్యకు గుండు కొట్టించిన భర్త.. తర్వాత సూపర్ ట్విస్ట్
సాధారణంగా ఇంట్లో వంట చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. తెలిసో తెలియకో.. జరిగే ఇలాంటి పొరపాట్ల విషయంలో భర్తలు, పిల్లలు సర్దు కుపోతారు. ఇలాంటివి తెరమీదికి వచ్చినప్పడు.. భార్యలు కూడా.. ''అయ్యో.. '' అని తెగ మథన పడిపోతుంటారు. ఇది సహజం.
అయితే.. ఉత్తర్ప్రదేశ్ లో మాత్రం చాలా విచిత్ర సంఘటన జరిగింది. అన్నంలో తల వెంట్రుకలు వచ్చాయని కోపోద్రిక్తుడైన భర్త తన భార్యకు ఏకంగా గుండు కొట్టించాడు. దీంతో ఆ వివాహిత తన భర్తతో సహా ముగ్గురిపై వరకట్న చట్టంలో పలు సెక్షన్ల కింద కేసు పెట్టింది. ఇంకేముంది.. పోలీసులు కట్టేసి మరీ భర్తను జైల్లోకి నెట్టేశారు.
ఉత్తర్ప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లా మిలాక్ గ్రామానికి చెందిన జహీరుద్దీన్కు, సీమాదేవి(30)కి 7 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. పెళ్లయినప్పటి నుంచి రూ.15 లక్షలు కట్నం ఇవ్వాలని అత్తింటివారు తనను వేధిస్తున్నారని సీమాదేవి అప్పటి నుంచి పుట్టింటివారితో చెప్పుకొని రోదించేది.
ఏదో ఒకరూపంలో తనను వేధిస్తున్నారని.. వాపోయేది. ఇదిలావుంటే, శుక్రవాం రాత్రి సీమాదేవి వంట చేసింది. తర్వాత ఆమె తన భర్తకు ఒక ప్లేట్లో అన్నం వడ్డించింది.
అయితే ఆమె భర్తకు ఆ ప్లేట్లో తల వెంట్రుక కనిపించింది. దీంతో కోపం తెచ్చుకున్న జహీరుద్దీన్.. తన భార్యతో తీవ్రస్థాయిలో గొడవకు దిగాడు. కొట్టాడు. అయ్యో తెలియక జరిగిందని సీమా దేవి మొరపెట్టుకు న్నా కరుణించలేదు. అంతేకాదు.. తెల్లవారి ఓ క్షురకుడిని ఇంటికి పిలిచి.. భార్యకు ఏకంగా గుండు కొట్టించాడు. ఘటన అనంతరం వివాహిత ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సీమాదేవి నుంచి అందిన కంప్లైంట్ ఆధారంగా.. నిందితులపై వరకట్న చట్టంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ భర్తను అరెస్టు చేసి జైలుకు పంపించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.