రోడ్డుపై గుంతలో బైక్ పడి కాలు విరిగింది..జీహెచ్ ఎంసీపై కేసు

Update: 2019-10-11 07:37 GMT
నా దారిన నేను బైక్ మీద పోతున్నా. రోడ్డు మీద ఉన్న గుంతలో బండి పడి.. చెయ్యి విరిగింది.. రోడ్డు మీద గుంత లేకుంటే చెయ్యి విరిగేదే కాదు కదా? దీనంతటికి కారణం జీహెచ్ ఎంసీ. నాకు జరిగిన నష్టానికి మూల్యం చెల్లించాల్సిందే అంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మీద ఒక వ్యక్తి కేసు పెట్టిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

హైదరాబాద్ లోని పంజాటన్ కాలనీకి చెందిన సయిద్ అజ్మత్ హుస్సేన్ జాఫ్రి అనే వ్యక్తి ఈ నెల ఆరున రాత్రి వేళ తన బైక్ మీద నూర్ ఖాన్ బజార్ నుంచి బాల్ షెట్టి ఖేట్ కు వెళ్లుతన్నారు. రోడ్డు మీద ఉన్న గుంత కారణంగా బైక్ ఒక్కసారిగా దిగబడింది.

దీంతో.. అతగాడు బైక్ మీద నుంచి ఎగిరి కిందపడ్డాడు. ఈ కారణంగా జాఫ్రి కాలు చీలమండకు ఫ్యాక్చర్ అయ్యింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు జీహెచ్ ఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాజాగా ఫోలీసులకు ఫిర్యాదు చేశాడు. అధికారుల నిర్లక్ష్యంతో తనకు జరిగిన నష్టంపై జీహెచ్ ఎంసీపై పోరాడేందుకు సిద్ధపడిన జాఫ్రీ.. న్యాయం చేయాలంటూ డబీర్ పురా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు.

అధికారుల నిర్లక్ష్యంతోనే రోడ్ల మీద భారీ ఎత్తున గోతులు ఏర్పడ్డాయని.. ఎప్పటికప్పుడు గుంతలు పూడ్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని.. ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడుకుంటున్నారన్న ఆవేదనను వ్యక్తం చేశారు. జాఫ్రీ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి.. విచారిస్తున్నారు.


Tags:    

Similar News