ఈ జూన్ 2న హైదరాబాద్ లో అలా జరగనుందా?

Update: 2016-04-11 06:58 GMT
జూన్ 2 ప్రత్యేకత ఏమిటని తెలంగాణలో పిల్లాడిని అడిగినా.. మరో మాట లేకుండా.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రాండ్ గా సెలట్రేట్ చేసే తెలంగాణ సర్కారు.. ఈసారి అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తుందా? అన్న ప్రశ్నకు అవుననే చెప్పాలి.తెలంగాణ రాష్ట్రం మొత్తం మురిసిపోయేలా.. హైదరాబాద్ ప్రజలు విపరీతమైన సంతోషానికి గురైన ఒక పనిని చేస్తుందన్న మాట బలంగా వినినిపస్తోంది.

తెలంగాణ ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రోను.. ఈ జూన్ 2 నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న పట్టుదలతో తెలంగాణ సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు. చారిత్రక దినోత్సవం రోజున చారిత్రక మెట్రోను షురూ చేస్తే అదిరిపోతుందని..  ఈ ప్రారంభ కార్యక్రమం చరిత్రలో అలా నిలిచిపోతుందన్న మాట వినిపిస్తోంది.

మెట్రో మొత్తంగా పూర్తి కానప్పటికీ రెండు రూట్లలో జూన్ 2న మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాగోల్ – మెట్టుగూడా - మియాపూర్ – ఎస్ ఆర్ నగర్ రెండు రూట్లలో మెట్రో రైలును పట్టాలకెక్కించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు రూట్లలో మెట్రో రైలు కానీ పట్టాలు ఎక్కితే 20 కిలోమీటర్లలో మెట్రో అందుబాటోకి వచ్చినట్లే. మరి.. అనుకున్నట్లే జూన్ 2కు తెలంగాణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెట్రో పట్టాల మీద పరుగులు తీస్తుందా..?
Tags:    

Similar News