హైదరాబాద్ పబ్ కేసు: నిందితులకు రిమాండ్.. అభిషేక్ నిరపరాది అంటున్న తల్లి

Update: 2022-04-04 07:28 GMT
హైదరాబాద్ లోని పబ్ లో నిన్న డ్రగ్స్ బయటపడడం కలకలం రేపింది. ఇక్కడ పార్టీ చేసుకున్న వారిని విచారించిన పోలీసులు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. ఇందులో సినీ, రాజకీయ ప్రముఖులు, వారి పిల్లలు ఉండడంతో ఇది చర్చనీయాంశమైంది. హైదరాబాద్ సిటీలో వరుసగా బయటపడుతున్న డ్రగ్స్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. డ్రగ్స్ దందాపై ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా చర్యలు చేపట్టారు.  ఇంతలోనే మరోసారి పబ్ లో డ్రగ్స్ బయటపడడం సంచలనమైంది.

ఇక దాడి సమయంలో ఈ పబ్ లో 5 గ్రాముల కొకైన్ ను స్వాధీన చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అలాగే రైడ్ సమయంలో పబ్లో 148 మంది ఉన్నారని, వీరిలో కొందరు డ్రింక్ లో కొకైన్ వేసుకొకున్నట్లు గుర్తించామన్నారు. అయితే డ్రగ్స్ ను ఎవరు వినియోగించారన్నది అప్పుడే చెప్పలేమని, విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామన్నారు. అందువల్ల అప్పుడే పబ్లోకి వచ్చిన వివరాలు వెల్లడించొద్దన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పబ్ నిర్వాహకులు అనిల్, అభిషేక్ లను అరెస్టు చేయగా.. మరో నిర్వాహకుడు అర్జున్ వీరమాచినేని పరారీలో ఉన్నట్లు తెలిపారు.ఇతడి కోసం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ పోలీసులు గాలిస్తున్నారు.

అయితే ఈ ఘటనలో తన కొడుకు అలాంటి వాడు కాదని అభిషేక్ తల్లి ఉప్పల శారద తెలిపారు. తాము బిజినెస్  కోసం పబ్ ను రన్ చేస్తున్నామని.. పాత పబ్ లో ఉన్న సిబ్బంది ఇక్కడున్నారని.. వారు చేసిన దానికి తన కొడుకును బాధ్యుడుగా చేయవద్దన్నారు. 145మందిలో ఎంత మంది డ్రగ్స్ తీసుకున్నారో పోలీసులు చెక్ చేయాలన్నారు. ఏ టేబుల్ కింద ఏం ఉందనే విషయం ఓనర్ కు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.

ఎవరో తెచ్చిన డ్రగ్స్ అందులో ఒక పార్టీ జరిగిందని.. 145 నుంచి 150మంది గెస్ట్ లు వచ్చారని అభిషేక్ తల్లి తెలిపారు. తాము ఒక పార్ట్ నర్ గా అభిషేక్ అక్కడకు వెళ్లాడని.. తన కొడుకును వేధించడం దుర్మార్గమని ఖండించారు.

బంజారాహిల్స్ లో టైమ్ ను పట్టించుకోకుండా.. నిబంధనలను పాటించకుండా గబ్బురేపుతున్న పబ్ పనిపట్టారు పోలీసులు. పబ్ లో విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్ముతున్నట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. పోలీసులు రైడ్ చేసినప్పుడు షుగర్ క్యాండీల మాటున.. బాత్ రూంలలో, కిటీకీల దగ్గర డ్రగ్స్ లభ్యమయ్యాయి.ప్రముఖుల పిల్లలకు కొందరికీ ఈ డ్రగ్స్, డ్రింక్స్ సప్లై చేస్తున్నట్టు సమాచారం. అందులో ఇవి తీసుకున్న సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలను టెస్టులు చేసి పోలీసులు నిర్ధారించనున్నారు.

లీసుల దాడిలో దొరికిన 45మంది రక్త నమూనాలు సేకరిస్తున్నామని అన్నారు. వీళ్లంతా డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం ఉందని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.  ఇక విధుల్లో నిర్లక్ష్యం వహించారని సీఐ శివచంద్రపై సస్పెన్షన్ వేటు వేసినట్టు కమిషనర్ తెలిపారు. ఏసీపీ సుదర్శన్ కు చార్జ్ మెమో జారీ చేశామని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. కొత్త సీఐగా నాగేశ్వర్ రావును నియమించారు.
Tags:    

Similar News